Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాకింగ్ రాకేష్ -రోహిణి ముద్దు సీన్ల వీడియో వైరల్.. అసలు సంగతేంటి?

Advertiesment
రాకింగ్ రాకేష్ -రోహిణి ముద్దు సీన్ల వీడియో వైరల్.. అసలు సంగతేంటి?
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:09 IST)
Rakesh, Rohini
తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ -రోహిణి ముద్దు సీన్లకు సంబంధించిన స్కిట్ సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. వీరి ముద్దుల గోలకు సోషల్ మీడియాలో వివిధ రకాల తంబ్ నెయిల్స్ తో వైరల్ చేశారు. అయితే వీటిని కూడా క్యాష్ చేసుకుని మరొక వీడియోని తీశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా రాకింగ్ రాకేష్ రోహిణి ఆ ముద్దు గురించి ముచ్చట్లు పెట్టిన వీడియోను సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు పొట్టినరేష్, ఇమ్మానియేల్ వంటి తదితరులు.
 
ఈ వీడియోలో రాకింగ్ రాకేష్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా రోహిణి కారులోకి రమ్మంటాడు. ఈ క్రమంలోనే కారులోకి వెళ్ళిన రోహిణి ఇప్పటికే మన ఇద్దరి గురించి వచ్చిన రూమర్లు సరిపోలేదా? మరి ఎందుకు ఇలా చాటుమాటుగా కలవమంటున్నావు.

అయినా ఎవరికీ తెలియకుండా ఇలా ఎందుకు కలవమన్నావు ఇలా మనిద్దరం కార్లో కూర్చొని మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే ఇంకేముందా.. అయినా నన్ను ఎందుకు రమ్మన్నావు అంటూ రోహిణి అడగగా అందుకు రాకేష్ అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయినా నేను అందుకు కాదు రమ్మన్నది. మనిద్దరం ముద్దు పెట్టుకున్నామని వచ్చిన ట్రోల్స్ ఎలా ఉన్నాయో చూసావా అంటూ రాకింగ్ రాకేష్ రోహిణి అడుగుతాడు.
 
రాకింగ్ రాకేష్ ఇలా అనడం తో ఏంట్రా.. రాకింగ్ రాకేష్ రోహిణి కి ముద్దు పెట్టాడని రాయమని చెప్పి వారికి డబ్బులు ఇచ్చావా ?అంటూ తనదైన శైలిలో రాకింగ్ రాకేష్ పంచ్ వేసింది. అయినా నీకు అంత సీన్ ఉందా? ముద్దులతో రెచ్చిపోవడం ఏంటి? రాకింగ్ రాకేష్ పెట్టే ముష్టి ముద్దును కూడా ముద్దు అని అంటారా? అంటూ రాకింగ్ రాకేష్ ముద్దు పై రోహిణి స్పందించారు. ఈ క్రమంలోనే రాకేష్ నిన్ను ఫస్ట్ ముద్దు పెట్టుకున్నది ఎవరు అని రాకేష్ అడగగా రోహిణి తన ముద్దుల చిట్టా బయటపెట్టింది.
 
తనని ముందుగా తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నారని, ఆ తర్వాత స్కూల్ లో బోలెడన్ని ముద్దులు పెట్టుకునే వాళ్ళమని తెలిపారు అలా తనకు బోలెడు మంది ముద్దులు పెట్టేవారని తెలిపింది. అయినా రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ బ్యూటీకి ముద్దులు పెట్టాడని, ముద్దులతో తనని నలిపేసాడు అని రాయడమే ఏంట్రా బాబు అంటూ రోహిణి ఎంతో సరదాగా రియాక్ట్ అయ్యారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళాప్రపూర్ణ రావు గోపాలరావు - వాచకానికి జేజేలు కొట్టిన ప్రేక్ష‌కులు