Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌గాళ్ళు ఎంత‌మందితోనైనా వుండొచ్చా- వాళ్ళు మామీద బ‌తుకుతున్నారుః రేష్మి సెస్సేష‌న‌ల్ కామెంట్‌

మ‌గాళ్ళు ఎంత‌మందితోనైనా వుండొచ్చా- వాళ్ళు మామీద బ‌తుకుతున్నారుః రేష్మి సెస్సేష‌న‌ల్ కామెంట్‌
, శనివారం, 14 ఆగస్టు 2021 (07:41 IST)
Reshmi-varsha
రేష్మి జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ఫైర్ బ్రాండ్‌. త‌న బాయ్‌ఫ్రెండ్ సుధీర్‌పై ర‌క‌ర‌కాలుగా సెటైర్లు, జోక్స్ వేస్తుంటుంది. ఇద్ద‌రూ సీరియ‌స్‌గా తెర‌పై పెండ్లిచేసుకుంటారు. ఆ త‌ర్వాత మామూలుగానే వుంటారు. పెళ్లి గురించి అడిగి అడిగిన రోజాకు, చూసే ప్రేక్ష‌కుల‌కు విసుగుపెడుతుంది కూడా. అయితే ఇటీవ‌లే రేష్మి త‌న వ్య‌క్తిగ‌త లైఫ్ గురించి మంచి కామెంట్ చేసింది. నేను ఎక్క‌డ‌కు వెళ్ళినా.. ఏ సినిమాలో న‌టించినా సుధీర్‌తోనే వుండాలంటున్నారు. ఇదేం పిచ్చో అర్థంకావ‌డంలేదు. మేం చేసేది వృత్తి. న‌ట‌న‌. జ‌బ‌ర్‌ద‌స్త్‌లో న‌టిస్తామ్‌. సినిమాల్లో న‌టిస్తాం. కానీ అది అంత‌వ‌ర‌కే. వేరే హీరోతో న‌టించ‌కూడ‌దా. న‌టిస్తే తాటాకులు క‌ట్టేస్తున్నారు. మ‌గాళ్ళ‌యితే ఎంత‌మందితోనైనా పులిహోర క‌ల‌ప‌వ‌చ్చా! ఆడ‌వాళ్ళు అలా చేయ‌కూడ‌దా! 
 
ఇలా మా క‌ల‌యిక‌పై ర‌క‌ర‌కాలుగా కామెంట్లు ట్రోలింగ్‌లు చేస్తున్నారు. అస‌లు వారంతా మా మీదే బ‌తుకుతున్నారంటూ ఫైర్ అయింది. అస‌లు విష‌యం ఏమంటే, బ‌జ‌ర్‌ద‌స్త్‌లో వ‌ర్ష గురించి తెలిసిందే. ఇమ్మానుయిలే్ తో చ‌నువుగా వుంటుంది. త‌నే త‌న‌కు లైఫ్ ఇచ్చాడంటుంది. ఇద్ద‌రూ ఒక‌ట‌వుతారు అని అనుకున్నారు. కానీ నిజ‌జీవితంలో సీన్ రివ‌ర్స్ గా వుంటుంది. 
 
ఇదే విష‌యాన్ని వ‌ర్ష ఇటీవ‌లే బ‌జ‌ర్‌ద‌స్త్‌లో బాధ‌ను వ్య‌క్తం చేసింది. ఇక్క‌డ వేరే మేడ‌మ్‌. ఇంటికి వెళితే వేరేగా వుంటుంద‌ని రోజాకు చెబుతూ క‌ళ్ళ‌వెంట నీళ్ళు పెట్టుకుంది. ఈమ‌ధ్య నామీద ట్రోలింగ్‌లు ఎక్కువ‌య్యాయి. వ‌ర్ష నువ్వు ఎవ‌రితో వున్నావ్‌? ఎక్క‌డికి వెళ్ళావ్‌? అంటూ అస‌భ్య‌క‌రంగా కామెంట్ చేస్తుంటూ, ఇంటిలో చాలా ఇబ్బందిగా వుంది. నా త‌మ్ముడు దాన్ని చూపిస్తూ, ఇదేంటి అక్కా? అంటూ అడుగుతున్నాడంటూ క‌ళ్ళ‌నీల్ళు పెట్టుకుంది. 
 
అప్పుడు ఈ విష‌య‌మై రేష్మి ఇచ్చిన కౌంటర్‌కు వ‌ర్ష ఫిదా అయిపోయింది. దానికితోడు రోజా కూడా ధైర్యం చెప్పింది. ఇవేమీ ప‌ట్టించుకోకు. భుజానికి చూపిస్తూ ఇలా చేత్తో తోసిపారేయ్ అంటూ.. చెప్ప‌డంతో మీరిచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. సో. అదీ రేష్మి, వ‌ర్ష‌ల ప‌ర్స‌న‌ల్‌లైఫ్ బాధ‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుర్ర‌కారుకు అందాలు చూపిస్తూ సూక్తులు చెబుతున్న కంగ‌నా