Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెర‌ముందు తెర‌వెనుక బెస్ట్ క‌పుల్స్ గా కితాబు

Advertiesment
Rashmi
Rashmi-Sudheer-chitu-sam
సినిమాలో న‌టించేట‌ప్పుడు ల‌వ‌ర్స్‌గా బాగా న‌టిస్తే కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయిందంటారు. ఇక తెర‌వెనుక కూడా అలాగే వుంటే ఉత్త‌మ‌ జంట‌గా చెబుతుంటారు. అలా నాగ‌చైత‌న్య‌, స‌మంత‌కు మంచి పేరుంది. మాంచి ఫాలోయింగ్ కూడా వుంది. ఇద్ద‌రూ క‌లిసి సినిమాలో న‌టించ‌డం, ఆ త‌ర్వాత కొన్నాళ్ళ‌కు పెండ్లి చేసుకోవ‌డం జ‌రిగింది. ఇప్పుడు బుల్లితెర జంట ర‌ష్మి, సుధీర్ కూడా అలాగే వుండాల‌ని ఆశిస్తున్నారు. అందుకే చైతు, స‌మంత‌ను ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. వారు మాకు స్పూర్తిగా అన్న‌ట్లుగా చెబుతున్నారు.
 
ఇటీవ‌లే ర‌ష్మి, నేను క‌లిసి సినిమా చేస్తున్నాం. హీరో హీరోయిన్లుగా మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని సుధీర్ ఇటీవ‌లే టీవీ షోలో వెల్ల‌డించారు. తాజాగా సుధీర్ త‌న సోష‌ల్‌మీడియాలో ఇలా స‌మంత‌, చైతు ఫొటోల‌ను పెడుతూ, ఆ ప‌క్క‌నే త‌ను, ర‌ష్మి ఫొటోల‌ను జ‌త‌చేసి సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. దీనికి ఫాలోయింగ్ బాగానే వ‌చ్చింది. ఆన్ స్క్రీన్‌, ఆఫ్  స్క్రీన్ బెస్ట్ కపుల్‌గా నెటిజ‌న్ స్నేహితులు కితాబిచ్చేశారు. సో. చైతు, స‌మంత‌లా ఇద్ద‌రూ క‌లిసి సినిమాలో న‌టించాక పెండ్లి చేసుకోబోతున్నార‌న్న‌మాట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ పెళ్లి సరే... కొడుకు ముందే ఆ కొరుకుళ్లు ఏంటి ప్రకాషూ..?