Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌హేష్ అన్న సినిమా ఇదే అవుతుందిః సుధీర్ బాబు

Advertiesment
మ‌హేష్ అన్న సినిమా ఇదే అవుతుందిః సుధీర్ బాబు
, సోమవారం, 23 ఆగస్టు 2021 (09:48 IST)
Sridevi Soda Center prerelease
`మహేష్ ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సుధీర్ కు కరెక్ట్ సినిమా పడితే నెక్ట్స్ లెవ‌ల్‌ కి వెళ్తాడు అన్నాడు. ఆయన అన్న సినిమా ఇదే అవుతుంది అనుకుంటున్నాను నేను. దర్శకుడు పలాస చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. పలాస కంటే  శ్రీదేవి సోడా సెంటర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోసూరిబాబు రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కి సూరిబాబు, శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి.వాళ్ల కోసం మళ్ళీ ఈ సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారు ఈ సినిమా అంత బాగా ఉంటుంది` అని సుధీర్ బాబు తెలిపారు.
 
70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు  సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం "శ్రీదేవి సోడా సెంటర్".  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. స్వ‌ర మాంత్రికుడు సంగీత ద‌ర్శ‌కుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.తను ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే పాట‌ను మెగాస్టార్ చిరంజీవి గారు విడుద‌ల చేశారు. ఈ మధ్యనే  సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హీరో ప్రభాస్ సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ "శ్రీదేవి సోడా సెంటర్" హక్కులను ఫాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని "N" కన్వెన్షన్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.
 
నిర్మాత అది శేషగిరిరావు మాట్లాడుతూ, ప్రస్తుతం పెద్ద పెద్ద నిర్మాతలు భయపడి వారి సినిమాలను ఓటిటి లలో విడుదల చేస్తుంటే ఈ చిత్ర నిర్మాతలు ఎంతో ధైర్యం చేసి ఈ సినిమాను మేము థియేటర్స్ లొనే విడుదల చేస్తామని చెప్పడం ఒక మంచి శుభ సూచికం వారికి నా అభినందనలు.థియేటర్స్ లో విడుదల చేయడానికి లక్ష్మణ్ కూడా ఎంతో కష్టపడ్డాడు. ఈ నెల 27 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
 
దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ.. రిస్కు తీసుకోవడానికి అస్సలు భయపడని వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. చాలా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తాడు సుధీర్ అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. తనతో నేను రెండు సినిమాలు చేశాను.ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు.తను భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన సినిమాలు తీయాలి. అలాగే చరిత్రలో మనకు తెలియని విషయాలను "పలాస 1978" చిత్రం ద్వారా తెలిపాడు దర్శకుడు కరుణ కుమార్.వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న "శ్రీదేవి సోడా సెంటర్"ను విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు ఎంతో ప్యాసినెట్ గా నిర్మించారు.ఈ నెల 27 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
 
చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి సంగీత దర్శకుడు మణిశర్మ గారి పాటలు వింటూ పెరిగిన నాకు ఆయన ఈ సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. మొదటగా ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయమేసింది. అటువంటిది ఆయన నన్ను తమ్ముడిలా ఆదరించి నాలో ఉన్న భయాన్ని పోగొట్టి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.ఆగస్టు 27వ తేదీన వస్తున్న మా సినిమా ఓటిటి లో చూసే సినిమా కాదు అందరూ ఫ్యామిలీ తో వచ్చి థియేటర్స్ లో మాత్రమే చూడవలసిన సినిమా ఇది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
 
అపశకునం అనుకున్నారు
చిత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు మాట్లాడుతూ, మేము సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి మాకు చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాము. అందరూ కూడా మీరు రాంగ్ టైంలో షూటింగ్ స్టార్ట్ చేశారు ఎదో అపశకునం జరుగుతుంది ఆలోచించుకొని షూట్ చెయ్యమని చెప్పారు అయినా మేము వెనుకడుగు వేయకుండా షూటింగ్ ప్రారంభించాము.అపశకునం అనుకున్న మాకు మొదటిసారి మేము ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేయగానే బిజినెస్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగానే తెలుగు తమిళ్, మలయాళం కన్నడ, హిందీలో కూడా బిజినెస్ అయిపోయింది దీనికంతా కారణం మా దగ్గర ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ ఉండడం వలనే ఇది సాధ్యమైంది. ఈ సినిమా తర్వాత దర్శకుడికి చాల ప్రాజెక్ట్స్ వస్తాయి. సినిమా చాలా బాగా వచ్చింది అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27 న వస్తున్న "శ్రీదేవి సోడా సెంటర్" అందరినీ తప్పక ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ప్రేక్షకులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ వచ్చి మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ, గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే..అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.నేను రొటీన్ సినిమాలు చెయ్యను డిఫరెంట్ గా ఉండే కథల్ని సెలెక్ట్ చేసుకుని చేస్తాను. ఎందుకు చెప్పానో ఈ నెల 27న రిలీజ్  అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండపొలం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్