Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి విడుద‌ల‌చేసిన `మందులోడా మాస్ కా బాస్` సాంగ్ కు స్పంద‌న‌

Advertiesment
చిరంజీవి విడుద‌ల‌చేసిన `మందులోడా మాస్ కా బాస్` సాంగ్ కు స్పంద‌న‌
, శుక్రవారం, 9 జులై 2021 (13:34 IST)
Chiru song release
వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. 
 
అదేవిధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి, ఆ త‌రువాత విడుద‌లైన గ్లిమ్స్ కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్వ‌ర మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే పాట‌ను మెగాస్టార్ చిరంజీవి గారు విడుద‌ల చేశారు. ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వ‌డంలో మ‌ణిశ‌ర్మ‌ది ఓ ప్ర‌త్యేక‌మైన శైలి, అందుకు త‌గ్గ‌ట్లుగానే ప్ర‌ముఖ లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్  మందులోడా అంటూ సాగే మాస్ తీన్ మార్ లిరిక్స్ అందించారు దీంతో ఇప్పుడు ఈ పాట‌ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 
 
webdunia
Chiru-Sudher-Karuna etc
ఈ పాట లిరిక‌ల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్ కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది. ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుద‌లైంది.
 
బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్,  నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, దర్శకత్వం – కరుణకుమార్. సంగీతం – మణిశర్మ, సినిమాటోగ్రఫి – శ్యాందత్ సైనుద్డీన్, ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్, కథ – నాగేంద్ర కాశీ, కొరియోగ్రఫి – ప్రేమ్ రక్షిత్, విజయ్ ప్రకాష్, యశ్వంత్‌, పాట‌లు- సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచ్చార‌ణ, స్వ‌చ్చ‌మైన న‌ట‌నకు పెట్టింది పేరు గుమ్మ‌డి