ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్ మరణం పట్ల యావత్ దేశంలోని ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగు పరిశ్రమలోనూ పలువురు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన సందేశంలో ఇలా పేర్కొన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది. భారతదేశంలో గర్వించదగ్గ నటుల్లో దిలీప్ ఒకరు. నటనకు ఆయన దిక్సూచి. అనేక దశాబ్దాలుగా తన నటనతో ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేశారు. ఆయనకు ఇవే మా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు.
మహేస్‌బాబు పేర్కొంటూ, టైంలెస్ లెజెండ్ యాక్టర్ ఆయన. ఆయన ఎంతోమంది నటులకు ప్రేరణగా నిలిచారు. భారతీయ సినిమాకు పూడ్చలేని నష్టం. ఆయన ఆత్మకు శాంతికలగాలని ఆకాంక్షించారు.
ఇక ఎన్.టి.ఆర్. తన ట్వీట్‌లో, భారతతీయ సినిమా ఎదుగుదలకు మీ కృషి ఎంతో వుంది. ఎంతోమంది నటులకు మీరు స్పూర్తి, అది వెలకట్టలేనిది. మీరు లేకపోవడం బాధాకరం అంటూ పేర్కొన్నారు.
దిలీప్ కుమార్ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కించుకున్నాడు.