సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చనే ప్రకటన ఇటీవలే ఎ.పి. ప్రభుత్వం తెలియజేసింది. యాభై శాతం సీటింగ్ తో థియేటర్లను ఓపెన్ చేయవచ్చని తెలిపిన విషయం తెలిసిందే. అయితే సినిమా టకెట్ రేట్ల విషయంలో నియంత్రం మాత్రం తమ చేతుల్లోనే వుందని ఇంతకుముందే ఎ.పి. ప్రభుత్వం ఎగ్జిబిటర్లు తెలియజేసింది. ఇప్పటికే హైదరాబాద్ ఫిలింఛాంబర్ కార్యాలయంలో రెండు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు సమావేశ మయ్యారు. వాటి వివరాలు మరికొద్దిసేపటిలో వెల్లడించనున్నారు.
కాగా, ఇప్పుడు థియేటర్ ఓపెన్ అయితే మొదటగా పవన్ నటించిన `వకీల్‌సాబ్` సినిమా ప్రదర్శించనుంది. కోవిడ్ సెకండ్‌వేవ్‌లో ఆ సినిమా విడులయినా కోవిడ్ తీవ్రతవల్ల కొద్దిరోజులే ఆడింది. ఇప్పుడు మరలా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలో చూడాలంటే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు ఫ్రీడమ్ వుండేలా టికెట్ రేటు పెంచుకునేలా ప్రభుత్వాన్ని కోరారు. మరోసారి నిర్మాతల మండలి ఏపీ ప్రభుత్వం దృష్టికి యథావిధిగా టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు కావాలని కోరగా దీనిపై ఏపీ ప్రభుత్వం కొత్తగా జీవో ను ఇష్యూ చేసింది.
తాజాగా సమాచారం ప్రకారం, ఎప్పుడు టికెట్ రేట్స్ తగ్గించడం పెంచడం అనేది ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని సందర్భాల ఆధారంగా వాటిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని తెలియజేసింది. దీనితో రాబోయే రోజుల్లో బడా చిత్రాలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పాలి.