Vijay Chilla, Shashi Devireddy
భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాల నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి రూపొందిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది జంటగా `పలాస 1978 `ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ, మేము ఫస్ట్ గ్లిమ్స్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన నాటినుంచే బిజినెస్‌పరంగా కొందరు సంప్రదించారు. ఆ తర్వాత సుధీర్ బాబు బర్త్ డే రోజు సాంగ్ రిలీజ్ చేశాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పటి నుంచి మా సినిమా బిజినెస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. సినిమా షూటింగ్ అయిపోయే లోపు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బిజినెస్ పూర్తయ్యింది.
- మొదట ఈ సినిమాకు "నల్ల వంతెన" అని టైటిల్ అనుకున్నాము.. కానీ మేము చేసే లవ్ స్టోరీ కి ఈ టైటిల్ క్యాచీగా లేదని భావించి ఆ షాప్ చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి "శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది.
- ఆనందోబ్రహ్మ సినిమా తీసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్స్ హర్రర్ కామెడీ కథలు చేస్తామని వచ్చి చాలా మంది చాలా కథలు చెప్పారు కానీ ఆనందోబ్రహ్మ స్క్రిప్ట్ కంటే బెటర్ అనిపించలేదు.అలాగే యాత్ర మూవీ చూసిన తర్వాత చాలా మంది బయోపిక్స్ తీస్తామని చాలా కథలు వినిపించారు. అవేవి కూడా మాకు యాత్ర కంటే బెస్ట్ అనిపించలేదు. భలే మంచి రోజు,ఆనందో బ్రహ్మ, యాత్ర ఇలా అన్నీ కూడా మేము డిఫరెంట్ జోనర్ సెలెక్ట్ చేసుకున్నాం. మంచి కథ ఎప్పుడు వస్తే ఆప్పుడు సినిమా చేస్తాం. కథలు లేటుగా వస్తున్నందున మాకు కొంత గ్యాప్ వస్తుంది అంతే తప్ప మేము గ్యాప్ తీసుకోవడం లేదు
- శ్యాం ప్రసాద్ గారు ఇప్పటివరకు ఏడు సినిమాలు తీశారు వాటి గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. అలా మేము మంచి కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తాం. మా చిత్ర దర్శకుడు కరుణ తీసిన పలాస రఫ్‌గా ఉన్నా ఈ సినిమా రియల్ గా ఉంటుంది. అమలాపురంలో చూస్తే ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అబ్బాయి, అమ్మాయి, వారి తల్లిదండ్రులు లాంటి వారు చాలా మంది కనిపిస్తారు. ఈ సినిమా రా..గా ఉండదు ఈ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ ఉంటాయి.
- మణిశర్మ సంగీతం రూరల్ సినిమాకు బాగా చేశారు. ఇక సుధీర్ గారు కృష్ణ గారు మహేష్ బాబు గార్లు నా పక్కన ఉంటే నాకు ఎంత ధైర్యం ఉంటుందో ఈ చిత్ర నిర్మాతలు నా పక్కనుంటే నాకు అంత ధైర్యం ఉంటుంది అన్నందుకు ఆయనకు మా ధన్యవాదాలు. అయితే సుధీర్ బాబుతో మేము సెట్ లో ఉన్నపుడు హీరో అండ్ ప్రొడ్యూసర్ లా ఉంటాము షూట్ అయిన తరువాత ఫ్రెండ్స్ లా ఉంటాము. అలా ఉండకపోతే సినిమా చేయలేము.ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ సైడ్, మూవీస్ ఈజ్ వన్ సైడ్. బయట సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటాం. మేం చేసే సినిమాల గురించి మాట్లాడితే మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటాము.
- మేము మంచి కథలు కోసం చూస్తున్నాం.ఇప్పుడు ఒక స్క్రిప్టు రెడీ అవుతుంది అది ఇంకా ఫైనల్ కాలేదు. వైయస్ జగన్ గారి బయోపిక్ కథ మాకు ఎవరూ చెప్పలేదు . ఏం డైరెక్టర్ కూడా చేస్తామని ఆఫీసియల్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాగే పెద్ద హీరోలతో మేము సినిమా చేయడానికి మేము సింద్దంగా ఉన్నాము ..కానీ మా కథ ఆ హీరోలకు నచ్చాలి ..వారికి మా కథ నచ్చితే మేము సినిమా చేస్తాము.
- సెకండ్ వేసి తర్వాత వస్తున్న బిగ్గెస్ట్ థియేటర్ రిలీజ్ మూవీ మా "శ్రీదేవి సోడా సెంటర్". సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ లక్ష్మణ్ గారి సపోర్ట్ తో ఆంధ్ర, తెలంగాణలలో సుమారు 500 థియేటర్స్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ఇవి కాక ఇంకా అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.
ఫ్యామిలీస్ కావచ్చు ఇంకెవరైనా కూడా 20 మెంబర్స్ కలసి టికెట్స్ బుక్ చేసుకుంటే షో వేస్తాము.యూఎస్ లో మేము ఇలాంటి కొత్త కల్చర్ ను అలవాటు చేస్తున్నాం అని తెలిపారు.