Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుభ‌వించు రాజా- ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన నాగార్జున‌

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (18:48 IST)
Tarun Raj
రాజ్ తరుణ్ కథానాయకుడిగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి(ఎస్‌వీసీ ఎల్ఎల్‌పి) ప‌తాకాల‌పై  ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. గ్రామీణ నేప‌ష‌థ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అనుభ‌వించు రాజా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను నాగార్జున విడుదల చేశారు.
 
‘అనుభ‌వించు రాజా’ టైటిల్ సౌండింగే చాలా డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే, చాలా సంతోషంగా ఉంటూ ఎంజాయ్ చేసే పాత్ర‌లో రాజ్ త‌రుణ్ క‌నిపించ‌నున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అలాగే రాజ్ త‌రుణ్ లుక్, డ్రెస్సింగ్ చూస్తుంటే పందెం రాయుడిలాగా క‌నిపిస్తున్నాడు. చేతికి బంగారు ఉంగ‌రాలు, చేతికి బ్రాస్‌లెట్ వేసుకుని ఉన్నాడు. పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌ను గ‌మ‌నిస్తే కొంద‌రు వ్య‌క్తులు రాజ్ త‌రుణ్ వెనుక నిల‌బ‌డి ఉన్నారు. క‌రెన్సీ నోట్లు గాల్లో ఎగురుతున్నాయి. పేక ముక్క‌లు, గుడి క‌నిపిస్తున్నాయి. పోస్ట‌ర్‌లో ఉల్లాసంగా ఉంటూ కోడి పందాలు, జూదం ఆడే వ్య‌క్తి క‌నిపిస్తున్న రాజ్‌త‌రుణ్ త‌న కోడితో స‌ర‌దాగా క‌నిపిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ‘అనుభ‌వించు రాజా’ త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది.
 
క‌షీష్ ఖాన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి న‌గేశ్ బానెల్ సినిమాటోగ్ర‌ఫీ, ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. భాస్క‌ర‌భ‌ట్ల లిరిసిస్ట్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments