Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిఎల్ఎన్ మీడియా ప‌తాకంపై ర‌మ‌ణ‌ హీరోగా `పాయిజ‌న్` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభం

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (19:54 IST)
ష‌ఫీ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న పాయిజ‌న్‌.. చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత శోభారాణి కుమారుడు ర‌మ‌ణ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్నాడు. ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కె. శిల్పిక నిర్మాత‌. చిత్రం గురించి ద‌ర్శ‌కుడు తెలుపుతూ.. క్రైం, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌తో రూపొందుతోంది. ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసే మ‌లుపులు ఇందులో వున్నాయి. హీరోయిన్లుగా ప్ర‌ముఖ మోడ‌ల్స్ న‌టిస్తున్నారు అని తెలిపారు.
 
నిర్మాత మాట్లాడుతూ.. థ్రిల్ల‌ర్ అయినా పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంద‌ని పేర్కొన్నారు. ష‌ఫీ మాట్లాడుతూ.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన త‌న‌కు ఈ చిత్ర క‌థ బాగా ఆక‌ట్టుకుంద‌నీ, మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని తెలిపారు. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన విధానం చాలా బాగుంద‌ని తెలిపారు.
హీరో ర‌మ‌ణ మాట్లాడుతూ.. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు అందించిన మా త‌ల్లిదండ్రులు ఎంతో స‌పోర్ట్‌గా నిల‌బ‌డి హీరోను చేశారు. ఈ క‌థ‌కు త‌గినట్లుగా పాత్ర‌లో ఒదిగిపోతాను. అందుకు ద‌ర్శ‌కుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పూణెలో న‌టుడిగా త‌ర్ఫీదు తీసుకుని వ‌చ్చాను అని తెలిపారు. మోడ‌ల్స్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబై, డెహ్రాడూన్ మోడ‌ల్స్ న‌టించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments