#Mumbaielectricity సోనూ సూద్ ట్వీట్‌పై ప్రశంసలు.. ఏమన్నాడంటే?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (19:51 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైలో సోమవారం ఉదయం రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ.. విద్యుత్‌ శాఖను విమర్శించారు. తెగ కామెంట్లు చేయడంతో #Mumbaielectricity ట్యాగ్‌ ట్రెండింగ్‌ అయ్యింది.
 
దీంతో అమితాబ్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, అలీ ఫాజల్‌ తదితరులు ముంబై వాసుల్ని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు. దయచేసి మౌనంగా, ఓపికతో ఉండాలని కోరారు. అయితే ఈ విషయంపై సోనూసూద్‌ స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
 
ముంబైలో రెండు గంటల పాటు కరెంట్ లేదనే విషయం దేశానికి మొత్తం తెలిసిపోయింది. కానీ ఇవాల్టికి కూడా దేశంలోని అనే ఇళ్లకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండని సోనూ పేర్కొన్నాడు.
 
అలా సమయోచితంగా ఆలోచించి సోనూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన తీరుకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. విద్యుత్‌ సరఫరా రెండు గంటలపాటు ఆగిపోవడంతో నెట్టింట్లో విమర్శలతో పాటు నవ్వులు కూడా పూశాయి. నవ్వించే బాలీవుడ్‌ మీమ్స్‌ను రూపొందించి షేర్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments