Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు ఆవిష్కరించిన బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ.. సాంగ్

దేవి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (10:07 IST)
chandrahas, dilaru and team
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ మహీ  ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి.
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు  రిలీజ్ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మంచి ఊపున్న బీట్‌ను అందించారు. ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు మెచ్చుకున్నారు. చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
త్వరలోనే రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.
 
నటీనటులు : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

ఇండోర్‌లో విజృంభించిన కరోనా.. కడుపు నొప్పితో వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. వీడియో వైరల్ (video)

వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments