Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

Advertiesment
Dil Raju, Amani,  Shashi Vantipalli and others

దేవి

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (11:32 IST)
Dil Raju, Amani, Shashi Vantipalli and others
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
 
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ -  మహిళల గురించి ఒక మంచి కథతో "నారి" సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు మావిచిగురు, శుభలగ్నం లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కల్యాణం మూవీస్ లో నటించారు. "నారి" సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్ కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
నటి ఆమని మాట్లాడుతూ, "నారి" సినిమా మహిళల గొప్పదనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు. ఈ మూవీలో ఇంతమంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్. ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే ఉంటారు. ఈరోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ. నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ అవుతున్న మా "నారి" సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ, మహిళలకు రక్షణ కావాలి, మహిళల్ని గౌరవించాలి అనే కాన్సెప్ట్ తో "నారి" సినిమాను రూపొందించాను. మా మూవీలో ఒక మహిళ జీవితాన్ని మూడు దశల్లో చూపిస్తున్నాం. 13-20 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు థియేటర్స్ కు తీసుకెళ్లి మా మూవీ చూపించాలని కోరుతున్నా. "నారి" లాంటి మూవీ చేశానని నా జీవితంలో గర్వంగా చెప్పుకోగలను. అలాంటి మంచి చిత్రమిది. మా ప్రమోషనల్ కంటెంట్ చూసి "నారి" సినిమాకు సపోర్ట్ చేయండి. మీరంతా తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు. 
 
నిర్మాత శ్రీమతి శశి వంటిపల్లి మాట్లాడుతూ, "నారి" సినిమా మహిళల కోసం చేసిన మూవీ. అయితే ప్రేక్షకులంతా సకుటుంబంగా చూసేలా ఉంటుంది.  మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న "నారి" సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. అన్నారు.
 
నటి మౌనిక రెడ్డి మాట్లాడుతూ, . మహిళల గొప్పదనం, ప్రస్తుతం వారు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యను ఎంతో చక్కగా ఈ మూవీలో మా డైరెక్టర్ గారు తెరకెక్కించారు. థియేటర్స్ లో మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటీనటులు - ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, శ్రీలత, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం - ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని... పూనమ్ షాక్...