Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

Advertiesment
SKN

దేవి

, బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (11:41 IST)
SKN
తెలుగు సినిమాలలో ఇప్పటికే పరభాషా హీరోయిన్స్  ఎక్కువయ్యారు అంటే దానికి నిర్మాతలు, దర్శకులు కారణం.ఇటీవలే  ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ డ్రాగన్" సినిమా ఈవెంట్ లో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించను అని తెలిపారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో నెగెటివ్ గా స్పందన రావడంతో పాటు, ఇండస్ట్రీ లోనూ చర్చ జరిగింది. దానితో ఆ మాట సరదాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ తెలిపాడు ఎస్ కేఎన్. ఆ తర్వాత రోజే తందేల్ సినిమా ఒటిటి వస్తోంది అనే దానిపై వివరణ ఇచ్చారు. ఇలా ఎదో కాంట్రవర్ సి తో  ముందున్నాడు. 
 
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - డ్రాగన్ సినిమా ఈవెంట్ లో తెలుగు అమ్మాయిల గురించి నేను జోక్ చేస్తూ మాట్లాడిన మాటలను స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలతో నేను పనిచేయను, తెలుగు అమ్మాయిలకు అ‌వకాశాలు ఇవ్వొద్దు, తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు అని నేను అన్నట్లు హెడ్డింగ్స్ పెట్టి కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. నేను ఇప్పటిదాకా 8, 9 మంది తెలుగు అమ్మాయిలను (రశ్మి, ఆనంది- ఈ రోజుల్లో, మానస - రొమాన్స్, ప్రియాంక జవాల్కర్ - టాక్సీవాలా, హారిక(సంతోష్ శోభన్ అప్ కమింగ్ మూవీ), ఐశ్వర్య - (అప్ కమింగ్ మూవీ), కుషిత(3 రోజెస్) ) హీరోయిన్స్ గా పరిచయం చేశాను, ఇషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఇనయా వంటి 12, 13 మంది తెలుగు హీరోయిన్స్  తో పనిచేశాను. నేను వర్క్ చేసిన వారిలో 80 పర్సెంట్ తెలుగు అమ్మాయిలే. ఇటీవల కాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో నేనూ ఒకరిని. హీరోయిన్స్ గానే కాదు డైరెక్షన్, రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్..ఇలా చిత్ర పరిశ్రమలోని అన్ని క్రాఫ్టుల్లో 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. 
 
త్వరలోనే ఆ టార్గెట్ రీచ్ అవుతాను. నేను నిర్మించే చిత్రాల్లో హీరోయిన్స్ గా ఫస్ట్ ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకే ఇస్తాను. నేను ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో తెలుగు అమ్మాయిలే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రైటర్ గా కూడా తెలుగు అమ్మాయిలనే తీసుకున్నాం. నేను నిర్మించే చిత్రాల్లో హీరోయిన్స్ గా ఫస్ట్ ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకే ఇస్తాను. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే