Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

Advertiesment
Pradeep Ranganathan, Anupama Parameswaran, Kayadu Lohar

దేవి

, సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (16:45 IST)
Pradeep Ranganathan, Anupama Parameswaran, Kayadu Lohar
పరభాషా నటి నటులు తెలుగు మాట్లాడితే ఆదరిస్తారని అందుకే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అని ప్రదీప్‌కు చెప్పాను అని రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ చిత్ర ద‌ర్శ‌కుడు అశ్వత్ మారిముత్తు అన్నారు. అలా  హీరో ప్రదీప్ రంగనాథన్ తన తమిళ్ సినిమా  రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో లవ్ టుడే’ లో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. 
 
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.   
 
 హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘లవ్ టుడే టైంలో ఇక్కడకు వచ్చినప్పుడు అందరికీ మాట ఇచ్చా. నెక్ట్స్ టైం ఇక్కడకు వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతా అని చెప్పా. అందుకే ఇప్పుడు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. మాటిస్తే చేస్తామా? లేదా? అన్న దానికంటే.. అసలు ప్రయత్నించామా? లేదా? అన్నదే ముఖ్యం. అదే మా డ్రాగన్ చిత్రం. ఓ మామూలు అబ్బాయి.. జీవితంలో ముందుకు వెళ్లాలని చేసే ప్రయత్నమే మా డ్రాగన్. ప్రతీ ఒక్కరం ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నించే ప్రతీ ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్ నిలిచిపోతుంది. నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఏదైనా సరే ప్రయత్నిస్తూ వెళ్తూ ఉంటే.. ఏదో ఒకరోజు సాధిస్తాం. లవ్ టుడే సినిమాను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. బేబీ మూవీని చూసిన తరువాత సాయి రాజేష్ గారితో చాలా మాట్లాడాను. నేను ఆ మూవీని చూసి చాలా ఏడ్చాను. మూవీని చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మా కోసం వచ్చిన కిషోర్ తిరుమల గారు, హరీష్ శంకర్ గారు, ఎస్ కే ఎన్ గారికి థాంక్స్. మా సినిమాను నిర్మించిన అర్చన మేడంకి థాంక్స్. అశ్వత్, నేను కాలేజ్‌‌లో ఉండేవాళ్లం. మాది పదేళ్ల పరిచయం. అశ్వత్ లాంటి ఓ ఫ్రెండ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రికి థాంక్స్. మైత్రి బ్యానర్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మళ్లీ అర్చన గారు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ.. ‘తెలుగు ఆడియెన్స్ నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు.. నువ్వు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు అని ప్రదీప్‌కు చెప్పాను. ఈరోజు ఆయన ఈవెంట్‌లో అద్భుతంగా మాట్లాడారు. అలాంటి డెడికేషన్ ఉంది కాబట్టే ప్రదీప్ ఈ స్థాయికి వచ్చాడు. ఏజీఎస్ అనేది నాకు హోం బ్యానర్. నెక్ట్స్ చిత్రాన్ని వాళ్ల బ్యానర్‌లోనే చేస్తున్నాను. నాకు వెన్నంటే ఉండి నన్ను నడిపించింది ఏజీఎస్ బ్యానర్. బేబీ ఫస్ట్ హాఫ్ చూసే సాయి రాజష్‌కు ఫోన్ చేశాను. హరీష్ శంకర్ గారు చేసిన సినిమాలన్నీ నాకు ఇష్టం. ఎస్ కే ఎన్ గారు సినిమాల్ని అద్భుతంగా పబ్లిసిటీ చేస్తారు. మైత్రి బ్యానర్లో పని చేయాలని ప్రతీ ఒక్క టెక్నీషియన్ కోరుకుంటారు. కయాదు చక్కగా నటించారు. అనుపమ అద్భుతమైన నటి. ఆమె తమిళ్, తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తెలుగు డైలాగ్స్‌ని కృష్ణ రాశారు. ఆయన ఇప్పుడు ఎస్ కే ఎన్ గారితో సినిమా చేస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. మంచి చిత్రాలను తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పుడూ ఆదరిస్తుంటారు. డ్రాగన్ కూడా అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది. మా మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్