Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదేళ్ళ కెరీర్ లో మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా : అనుపమ పరమేశ్వరన్

Advertiesment
Anupama Parameswaran, Darshan Rajendran, Sangeeta

డీవీ

, బుధవారం, 22 జనవరి 2025 (20:04 IST)
Anupama Parameswaran, Darshan Rajendran, Sangeeta
'సినిమా బండి' దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి  విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ ప్రముఖ నటి సంగీత వంటి తారాగణం వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ , కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు దుల్కర్ సల్మాన్ ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.
 
ఈ టీజర్ కథానాయిక సుబ్బు పాత్రను అనుపమ పరమేశ్వరన్ వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తుంది. కథకుడి ప్రకారం, సుబ్బు చాలా దూరం ప్రయాణించి తన జీవితాన్ని ముగించడానికి 70 లక్షలు చెల్లిస్తుంది. ఆ తర్వాత సుబ్బు, దర్శన రాజేంద్రన్, సంగీత పోషించిన మరో ఇద్దరు ప్రధాన పాత్రలతో కలిసి సాహసోపేతమైన యాత్రకు బయలుదేరడం ఆసక్తిగా వుంది. అయితే, సుబ్బు ప్రయాణంలో సీక్రెట్ ఎజెండా వుంది.
 
టీజర్ ముందుకు సాగుతున్న కొద్దీ, గ్రామంలోని పాత ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలను రివిల్ చేస్తుంది, వాటిలో మహిళలు ముఖాలను కప్పుకోవడం, సతి లాంటి ఆచారం ఉన్నాయి. చివర్లో, అనుపమ పరమేశ్వరన్ ముఖం  రివిల్ కావడం మిస్టిరియస్ ఎక్సపీరియన్స్ ఇస్తోంది.
 
తన మొదటి చిత్రం సినిమా బండి లాగానే, పరదా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల చేసిన మరొక  యూనిక్  ప్రయత్నం. కథలోకి ఒక  గ్లింప్స్ అందించే ఈ టీజర్, గొప్ప కథనం,మ అత్యున్నత స్థాయి నిర్మాణ  సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ రూరల్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది, మరియు ఆమె పాత్రకు సరిగ్గా సరిపోతుంది. దర్శన రాజేంద్రన్మ  సంగీత ఉండటం ఈ చిత్రానికి  గ్రేట్ వాల్యూస్ యాడ్ చేశారు.
 
మృదుల్ సుజిత్ సేన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలను, గ్రామీణ పరిస్థితులను అందంగా చూపించారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం ఎక్స్ పీరియన్స్ ని మరింత పెంచుతుంది, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. ఆనంద మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తంమీద, టీజర్ తెలుగు, మలయాళ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది.
 
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. నా పదేళ్ళ జర్నీ చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. మిమల్ని అలరించడానికి  ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే రెస్పాన్స్ బులిటీ. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది. ఈ పదేళ్ళలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా, మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా  అందరూ ఇష్టపడి చేసిన సినిమా, అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. నన్ను నమ్మి బిలీవ్ చేసిన విజయ్ గారికి ప్రవీణ్ గారి థాంక్ యూ.  మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ' అన్నారు.
 
హీరోయిన్ దర్శన మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం. చాలా టఫ్ ఛాలెంజ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు. అనుపమ, సంగీత గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈ సినిమాలో మ్యాజిక్ కు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అన్నారు. 
 
యాక్టర్ సంగీత మాట్లాడుతూ..  సినిమాలో చేయడం ఆనందంగా వుంది.  అనుపమ, దర్శన నుంచి చాలా నేర్చుకున్నారు. చాలా కూల్ గా వుంటారు. ఇలాంటి గొప్ప కథని రాసిన డైరెక్టర్ కి థాంక్. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను'అన్నారు
 
నిర్మాత విజయ్ మాట్లాడుతూ..ఈ సినిమాతో కంటెంట్ మాట్లాడుతుంది. శ్రీధర్, శ్రీనివాస్ చాలా సపోర్ట్ చేశారు. ఆనంద్ మీడియా అంటే మేము ముగ్గురం. ప్రవీణ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా మలయాళం రైటర్స్ దుల్కర్ తీసుకున్నారు. పాజిటివ్ హోప్స్ వున్నాయి, ఈ సినిమాతో గట్టిగా కొడతాం' అన్నారు.
 
డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ.. ఐడియాలు చాలా వుంటాయి, కానీ ఒక నిర్మాత డబ్బులు పెడితేనే ఇలాంటి సినిమా వస్తాయి. అనుపమ గారు దర్శన గారు కంటెంట్ పై చాలా నమ్మకం పెట్టారు. పరిశ్రమలో అన్ని రకాల సినిమాలు రావాలి, ఈ సినిమా విమెన్ ఒరియంటెడ్ సినిమాలకి బిగ్ ఓపెనింగ్స్ ఇస్తుంది. ఈ సినిమాకి కమర్షియల్ గా డబ్బులు వస్తాయి. ఈ సినిమా టీం వర్క్. ఈ సినిమా క్రెడిట్ టీం అందరికీ దక్కుతుంది. ఈ సినిమాతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు చూస్తారు' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్వతాలు, మడ అడవులు, ఎడారులు: దుబాయ్‌లో ఔట్‌డోర్ సాహసాలు