Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు : రానా దగ్గుబాటి

IFFI team with Rana

డీవీ

, శుక్రవారం, 22 నవంబరు 2024 (16:54 IST)
IFFI team with Rana
భారతదేశంలో మోస్ట్ సెలబ్రేటెడ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్  ప్రైమ్ వీడియో, నవంబర్ 21న ప్రతిష్టాత్మకమైన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో తన మొట్టమొదటి సెలబ్రిటీ చాట్ షో, రానా దగ్గుబాటి షో వరల్డ్ ప్రీమియర్‌ను నిర్వహించింది. నాని, తేజ సజ్జా పాల్గొన్న అన్ స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ మొదటి ఎపిసోడ్ సజ్జా, ప్రియాంక అరుల్మోహన్ ప్రత్యేక స్క్రీనింగ్‌లో ఆడిటోరియంలో హాజరైన ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణను పొందారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలు ప్రదర్శించబడుతుంది, ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్‌లు అలరిస్తాయి.
 
వరల్డ్ ప్రీమియర్‌కు 250 మందికి పైగా సినీ ప్రముఖులు హాజరయ్యారు.  స్క్రీనింగ్‌లో రానా దగ్గుబాటితో పాటు సోనాల్ కబీ, డైరెక్టర్ & హెడ్ - మార్కెటింగ్, ప్రైమ్ వీడియో, ఇండియా,  శ్రీమతి. శిల్పా రావు తెనుగుల - డైరెక్టర్ (ఫిల్మ్స్), మినిస్ట్రీ ఆఫ్ I&B, శ్రీమతి. తరుణ్ తల్రేజా, GM - NFDC వద్ద ఉత్పత్తి & పంపిణీ, I&B మంత్రిత్వ శాఖ , శ్రీమతి. డెలిలా లోబో - వైస్ చైర్‌పర్సన్, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ESG) తదితరులు పాల్గొన్నారు.  
 
రానా దగ్గుబాటి షో సాంప్రదాయ చాట్ షోల  బ్రేక్ చేస్తూ అభిమాన తారల జీవితాల్లోకి ఒక అద్భుతమైన పీక్ ఇస్తుంది. దుల్కర్‌తో కలిసి టీ తాగడం నుండి నాగ చైతన్యతో కార్లలో సూప్ చేయడం వరకు, సిద్ధు జొన్నలగడ్డ మరియు శ్రీలీలతో పిజ్జాలు కాల్చడం,  రాజమౌళిని అతని అవుట్‌డోర్ షూట్ లొకేషన్‌లో సర్ ప్రైజ్  మునుపెన్నడూ చూడని వినోదం అందిస్తుంది
.
"రానా దగ్గుబాటి షో 55వ ఎడిషన్‌లో ప్రతిష్టాత్మక ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రేక్షకుల ముందు ప్రదర్శించబడుతుందని ఎప్పుడూ ఊహించలేదు. మేము సెలబ్రిటీలు,  అభిమానుల మధ్య స్క్రీన్‌ను తీసివేసి టాక్ షో ఫార్మాట్‌ని మార్చాము.  ప్రైమ్ వీడియోకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నవంబర్ 23న షో ప్రారంభించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ఎదురుచూస్తున్నాను” అని రానా అన్నారు షో హోస్ట్, క్రియేటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  రానా దగ్గుబాటి.
 
ప్రైమ్ వీడియో, ఇండియా డైరెక్టర్ & మార్కెటింగ్ హెడ్ సోనాల్ కబీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ప్రైమ్ వీడియోలోని కంటెంట్ పట్ల అపారమైన ప్రేమను, ప్రశంసలను కనబరిచారు వారి అభిరుచులు తగ్గ కన్తెహ్ట్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. స్ట్రీమింగ్ సేవలకు అత్యంత ప్రసిద్ధ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 55వ ఎడిషన్‌లో మా అప్ కమింగ్ అన్ స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్‌ను ప్రదర్శించడం చాలా గర్వించదగిన విషయం. రానా దగ్గుబాటి షోతో, మేము టాక్ షో  డిజైన్ పూర్తిగా మార్చాము. రానా విజన్ , సెలబ్రిటీలతో ఉన్న బాండింగ్  సిరీస్‌కి ఎంతో ప్రత్యేకతని తీసుకొచ్చింది.
 
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) అనేది గ్లోబల్ సినిమాని ప్రదర్శించే ప్రతిష్టాత్మక సినిమా ఈవెంట్, ఇది ఫిల్మ్ మేకర్స్, సినీ ప్రముఖులకు విభిన్నమైన  చిత్రాల ప్రపంచాన్ని,  చిత్రనిర్మాణ ఆర్ట్ ని కనెక్ట్ చేయడానికి, సెలబ్రేట్ చేయడానికి వేదిక. రానా దగ్గుబాటి షోతో పాటు, IFFI యొక్క 55వ ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్రాలు, సిరీస్‌ల ఎంపికను ప్రదర్శిస్తోంది, వీటిలో మాస్టర్‌క్లాస్‌లు, వర్క్‌షాప్‌లు. సినిమా ఎక్స్ లెన్స్ ని పెంపొందించే రెట్రోస్పెక్టివ్‌లు ఉన్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోసాని క్షమార్హులు కాదు... ఆయనది పగటి వేషం : నిర్మాత ఎస్కేఎన్