Brahmaji, Nag Ashwin, Chandu Mondeti, Buchibabu Sana, Satyadev
బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. స్టార్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, చందూ మొండేటి, బుచ్చిబాబు సాన, హీరో సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, బాపు ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. సినిమా టాక్ బావుంటే మన తెలుగు ఆడియన్స్ సెకండ్ డే నుంచి హౌస్ ఫుల్ చేస్తారు. ఈ సినిమాకి అన్నీ గుడ్ వైబ్స్ వున్నాయి. మ్యూజిక్, స్టార్ కాస్ట్ అంతా ఇంప్రెసివ్ గా వుంది. మణి స్క్రీన్ మీద ఇంటెన్స్ గా ఉంటాడు 'అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, బ్రహ్మాజీ తెల్ల జుట్టు ఈ సినిమాలో కనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. అంత నేచురల్ గా చేశారు. బ్రహ్మాజీ అన్న తన భుజంపై వేసుకొని ప్రమోట్ చేశారు. ట్రైలర్ లో రా ఎమోషన్ కనిపిస్తోంది. టీం అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ... చిన్న సినిమా పెద్ద సినిమా అని వుండదు. మంచి సినిమా ఏదైనా పెద్ద సినిమానే. బాపు ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఫెబ్రవరి 21 కోసం ఎదురుచూస్తున్నాను' అన్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు సాన మాట్లాడుతూ... బాపు సినిమా ట్రైలర్ చూశాను. చాలా బావుంది. ట్రైలర్ డైరెక్టర్ హీరోలా కనిపించారు. దయ గారు చాలా బాగా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ'అన్నారు.
యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆడియన్స్ టికెట్స్ కొని కలెక్షన్స్ వస్తే అందులో నుంచి ఇస్తానని చెప్పారు. ప్లీజ్ అందరూ థియేటర్స్ కి వెళ్లి మా రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి.. ఇందులో ఓ మంచి పాత్ర చేశాను. ఈ సినిమా క్రెడిట్ మా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మా టీం అందరికీ థాంక్ యూ'అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ద్రువన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బాపు అద్భుతమైన కథ. ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి నన్ను ఎంచుకున్న డైరెక్టర్ దయకి థాంక్ యూ. లిరిక్ రైటర్స్ కి థాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాని చూసి ఆడియన్స్ గొప్ప అనుభూతిని పొందుతారు'అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ...బాపు సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ. ద్రువన్ నాకు ఎప్పటినుంచో తెలుసు. బాపు సినిమా పెద్ద హిట్ కావాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.