Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియ‌ల్ దండుపాళ్యం జ‌న‌వ‌రి 21న విడుద‌ల‌

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (18:04 IST)
Real Dandupalyam
రామ్ ధ‌న్ మీడియా వ‌ర్క్స్  స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై   రాగిణి  ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం `రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి,  రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రాన్ని ఈ నెల 21న రామ్‌ధ‌న్ మీడియా వ‌ర్క్స్  రిలీజ్ చేస్తోంది
 
Real Dandupalyam team
ముఖ్యఅతిధి సురేష్ కొండేటి మాట్లాడుతూ,`దండుపాళ్యం సిరీస్ తెలుగు, క‌న్న‌డ భాషల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  వాటిని మించేలా `రియ‌ల్ దండుపాళ్యం` చిత్రం ఉండ‌బోతుంద‌ని  ట్రైల‌ర్ చూశాక అర్థ‌మైంది. రాగిణి ద్వివేది అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాల్మీకి ఈ చిత్రంతో సినిమా రంగంలో కూడా స‌క్సెస్ సాధించి మరెన్నో చిత్రాలు నిర్మించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
రామ్ ధ‌న్ మీడియా వ‌ర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ, సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’.  ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో  రియ‌లిస్టిక్ గా  తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు మ‌హేష్. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ఎన్నో సంఘ‌ట‌న‌ల‌కు అద్దం ప‌ట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంట‌ర్స్ లో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇది ఓటీటీలో క‌న్నా మంచి సౌండ్ సిస్టమ్ తో థియేట‌ర్స్ లో చూడాల్సిన చిత్రం కాబ‌ట్టి థియేట‌ర్స్ లోనే రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
నిర్మాత సి.పుట్ట‌స్వామి మాట్లాడుతూ, మా చిత్రం న‌చ్చి రామ్ థ‌న్ మీడియా వ‌ర్స్క్  వారు వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చారు. రియ‌ల్ ఇన్సిడెంట్స్ కు ద‌గ్గ‌ర‌గా రియ‌ల్ దండుపాళ్యం ఉంటుంద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments