బాలీవుడ్ కథానాయిక రాగిణి ద్వివేది కన్నీరు పెట్టుకుంది. తన కుటుంబంపై దుష్టప్రచారానికి పాల్పడ్డవారందరూ ఒక్కసారి ఆలోచించాలని, రేపు అనే రోజు ఒకటుందని మానసిక క్షోభతో సోషల్‌మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కొని 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన తర్వాత తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటింది.
తనపై జరిగిన దుష్ప్రచారంపై బాధను వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. చాలా కాలంగా తన కుటుంబంపై కక్ష కట్టినట్లుగా కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించింది. తనపై, తన వారిపై పెట్టిన కామెంట్లు ఒకసారి చదువుకోండని వారిని అడిగింది.
ఇలాగే మీ కుటుంబాలపై కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండని పేర్కొంది. నేను దాని గురిచి పెద్దగా ఆలోచించకపోయినప్పటికి ఆ బాధ వెంటాడుతూనే ఉంది. కాలం ప్రతి గాయాన్ని నయం చేస్తుంది. కొంత కాలం తర్వాత అన్ని విషయాల గురించి మాట్లాడుతాను. ప్రస్తుతం నేను క్లిష్ట దశలో ఉన్నాను. ఇప్పటికీ నాకు, నాకుటుంబానికి అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు అని తెలియజేసింది. ఏదైనా కాలమే తగిన సమాధానం అందరికీ చెబుతుందని పేర్కొంది.