Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి 14న టెలివిజన్ షూటింగులు బంద్

Advertiesment
ఫిబ్రవరి  14న టెలివిజన్ షూటింగులు బంద్
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:20 IST)
Telivision Asociation meeting
తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్ళు అవుతుంది. ఇంటి స్థలాల కోసం టివి నగర్, కోసం తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఏకమయింది. అందుకు బంద్ కూడా ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఛాంబ‌ర్‌లో టీవీ సంఘ అధ్య‌క్షుడు నాగ‌బాల సురేష్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో స‌‌మావేశం జ‌రిగింది.

ఆ వివ‌రాలు. మన తెలుగు టెలివిజన్ పరిశ్రమ  గత 48 సంవత్సరాలుగా ఇంతై వటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒకనాటి దూరదర్శన్‌లో అరగంట చిత్రహార్ కార్యక్రమం నుండి నేడు 143 శాటిలైట్  చానెల్స్ స్థాయికి ఎదిగింది. నాడు కేవలం 16 మంది సిబ్బందితో ప్రారంభమైన దశ నుండి నేడు షుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక లక్ష 48 వేళా మంది కార్మికులతో టెలివిజన్ రంగం పనిచేస్తుంది. వారంతా తమ తమ క్రాఫ్టులను యూనియన్లుగా అస్సోసియేషన్లుగా ఏర్పరచుకున్నారు ఆ యూనియన్లు అన్ని కలసి గత 12 సంవత్సరాల క్రితం 'తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ మరియు వర్కర్స్ పెడరేషన్' ఏకగ్రీవంగా ఎఏర్పాటు చేసుకుని ఒక మహా సంఘంగా  ఆవిర్భవించింది. 
 
దీనికి సంబంధించిన 21 యూనియన్లు అస్సోసియేషన్లు ఈ ఫెడరేషన్ కు అనుబంధంగా వున్నాయి. టెలివిజన్ పరిశ్రమ ప్రగతికి ఈ రెండు సంఘాలు అన్ని విధాలా ప్రాతినిధ్యం కృషి చేస్తున్నాయి. నేడు టెలివిజన్ పరిశ్రమ ద్వారా ఏడాదికి అన్ని విధాలా  8000 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది.టెలివిజన్ ద్వారా  16 కోట్ల మంది తెలుగు ప్రజలకు తమ తమ ఇళ్లలో ఆనందాన్ని విజ్ఞానాన్ని వినోదాన్ని అందించడానికి యెల్ల వేళలా 143 ఛానళ్ళు (24x 7) 1,48,000 మంది నటి నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు అను క్షణం కృషి చేస్తున్నాయి.

మన తెలుగు టెలివిజన్ పరిశ్రమకు చెందిన అన్ని చానెల్స్, నిర్మాణ సంస్థలు , నిర్మాతలు , నటి నటులు , సాంకేతిక నిపుణులు, ఛానెళ్లలో స్టూడియోలలో పని చేస్తున్న ఉద్యోగులు  ప్రభుత్వాలకు సర్వీస్ టాక్స్, టిడియస్, జియస్టిల రూపేణా ప్రతి ఏడాది ప్రభుత్వానికి షుమారు 1,800 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇందులో కనీసం ఒక శాతం కూడా ప్రభుత్వం తెలివిజాం పరిశ్రమ సంక్షేమానికి ఖర్చు చేయడంలేదు. 'ఇది కాదు విచారకరం' తెలుగు టెలివిజన్ పరిశ్రమకు అత్యవసరంగా ప్రభుత్వం అందించ వలసిన మంజూరు చేయవసిన పథకాలు కొన్ని వున్నాయి. ఈ డిమాండులు  చాలా కాలంగా వున్నాయి.
 
1. టెలివిజన్ పరిశ్రమకు 'టివి నగర్' పేరిట, ఇండ్లు లేని వారికీ ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయటం.
2. టి వి పరిశ్రమ లోని అన్ని వర్గాల కార్మికులకు రేషన్ కార్డులు లేనివారికి ఇవ్వటం.
3. టి వి పరిశ్రమ లోని రంగాల కార్మికులకు జీవిత భీమా, ఇన్సూరెన్సు , హెల్త్ ఇన్సూరెన్సు ఇవ్వటం.
4. టి వి పరిశ్రమలోని పని చేస్తున్న వారికి ఎఫ్. డి. సి నుండి పోలీస్ శాఖ ఇతర శాఖల నుండి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి  గుర్తింపు కార్డులు.
5. చిత్రపురిలో వున్నా 9 ఎకరాల స్థలం మన టి వి పరిశ్రమకు కేటాయించటం. లేక పద్మాలయా స్టూడియోకు ఆనుకొని వున్నా భూమి కేటాయించటం.
 
పై ముఖ్యమైన పథకాలు మన తెలుగు టెలివిజన్ పరిశ్రమకు సత్వరంగా అవసరం వున్నా నిమిత్తం ఈ విషయాలు మన ప్రభత్వం దృష్టికి తీసుకురావడానికి పరిశ్రమలోని కార్మికులు అందరూ  ఏకతాటిగా నిలిచి ముక్త కంఠంతో ఒక వేదిక ద్వారా విన్నవించాలని ఒక భారీ సభను ఫిబ్రవరి రెండవ ఆదివారం 14. 02. 2021 నిర్వహిస్తోంది.

ఈ రోజు షూటింగ్లకు సెలవుగా ప్రకటించడం జరిగింది. ఇందుకు నిర్మాతల మండలి సహకారం కూడా లభించింది. అధిక సంఖ్యలో షుమారు 2000 మంది టెలివిజన్ కార్మికులు ఈ షబాకు హాజరవుతున్నారు. అనేక మంది రాష్ట్ర మంత్రులు పరిశ్రమ పెద్దలు నిర్మాతలు, దర్శకులు హాజరవుతున్నారు. తెలుగు  టెలివిజన్  పరిశ్రమకు టి వి నగర్ కావాలని, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్సు, జీవిత భీమా కావాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది.

 
తెలుగు టెలివిజన్ పరిసర దేశం గర్వించే స్థాయికి ఎదిగింది . ఎందరో సినిమా నటి నటులకు సాంకేతిక నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. కరోనా సమయంలో కూడా ఎలాంటి అవాంతరాలు జరుగకుండా  నిర్విరామంగా కార్యక్రమాలు ప్రసారం జరిగాయి. ఈ సందర్భంగా రన్నింగ్ సీరియల్ నిర్మాతలకు నిర్మాణ సంస్థలకు పలు టెలివిజన్ ఛానల్ అధినేతలకు యూనియన్ల అధినేతలకు 'విశిష్ట సేవ రత్న ' పురస్కారములతో సత్కారం జరుగుతుంది.
 
టెలివిజన్ పరిశ్రమకు తాము ఎల్లవేళలా సహకారం అందిస్తామని తమవంతుగా త్వరలో టి వి అవార్డులు కూడా ఇస్తామని విజన్ వి వి కె చైర్మన్ వి విజయ్ కుమార్ ఈ సందంభంగా నాలుగు లక్షల రూపాయలు ఈ సభా ఖర్చులకు విరాళంగా టి వి ఫెడరేషన్ కు  ఇచ్చారు. ఇంకా ఈ సభలో విజయ్ యాదవ్, కూనపు రెడ్డి శ్రీనివాస్, ఎం ఆర్ సి రాజు, 21 క్రాఫ్ట్ల్ ప్రెసిడెంట్స్, సెక్రెటరిలు మాట్లాడారు  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ షర్మిల ఆవిష్క‌రించిన `ఈ కథలో పాత్రలు కల్పితం`సాంగ్