Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం అభిజీత్ ముహూర్తంలో ఈ పని చేస్తే..?

శనివారం అభిజీత్ ముహూర్తంలో ఈ పని చేస్తే..?
, శనివారం, 23 జనవరి 2021 (05:00 IST)
అభిజిత్ ముహూర్తం ప్రతిరోజూ వస్తుంది. సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తం తరహాలో, సూర్యోదయానికి తర్వాత సరిగ్గా ఆరుగంటలకు తర్వాత వచ్చేదే అభిజీత్ ముహూర్తం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు వున్న కాలాన్నే అభిజీత్ ముహూర్తం అంటారు. శుభకార్యాలను ముహూర్త సమయంలో వాయిదా పడిపోతే.. అభిజీత్ ముహూర్తాన్ని వాడవచ్చుననని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
''జిత్'' అంటే విజయం అని అర్థం. అభిజిత్  అంటే దిగ్విజయం అనే అర్థం. ఉత్తరాషాఢకు అభిజీత్ ముహూర్తానికి సంబంధం వుంది. ఈ నక్షత్రం రోజున చేసే కార్యాలు విజయం పొందుతాయి. మానవ సృష్టికే అభిజీత్ ముహూర్తం సహకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఋషులు, మునులు, దేవతలు కూడా ఈ అభిజీత్ ముహూర్తాన్ని వినియోగిస్తారని పురాణాలు చెప్తున్నాయి. 
 
సోమవారం అభిజీత్ ముహూర్తాన పదవి యోగం, ఉన్నత పదవులు, గృహ యోగం పొందేందుకు ఈ ముహూర్తంలో ప్రార్థన చేయవచ్చు. మంగళవారం అభిజీత్ ముహూర్తాన్ని.. ఆ ముహూర్త అధిదేవతను పూజిస్తే రుణాలు తీరిపోతాయి. సంతానం కోసం బుధవారం అభీజిత్ ముహూర్తాన్ని, గురువారం విదేశీయోగం కోసం, వివాహ యోగం కోసం శుక్రవారం అభిజీత్ ముహూర్తాన్ని ప్రార్థించడం చేయాలి. 
 
ఇక శనివారం పూట అభిజీత్ ముహూర్తాన్ని పూజిస్తే.. కేసుల్లో విజయం చేకూరుతుంది. శని దోషాలు తొలగిపోతాయి. ఆదివారం అభిజీత్ ముహూర్త ప్రార్థనతో సకల దోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-01-2021 శనివారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని దర్శించినా...