Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిప్పతీగ చూర్ణంతో మధుమేహం పరార్.. వ్యాధినిరోధక శక్తి కూడా..?

తిప్పతీగ చూర్ణంతో మధుమేహం పరార్.. వ్యాధినిరోధక శక్తి కూడా..?
, సోమవారం, 18 జనవరి 2021 (21:37 IST)
Giloy
తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు. మధుమేహం వున్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. 
 
గోరు వెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజూ రెండు పూటలా తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
చలికాలంలో సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే..అజీర్తి తగ్గుతుంది. 
 
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతం అయ్యేవారు తిప్పతీగ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
 
మధుమేహం నియంత్రణకు ప్రతి దినం ఉదయం రెండు ఆకులు, సాయంకాలం రెండు ఆకులను క్రమం తప్పకుండా తింటూ వుంటే ప్రారంభదశలో వున్న మధుమేహం అదుపులో ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆకులను తినడం వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలు తగ్గుతాయి. కాండం రసాన్ని ప్రతి దినం తీసుకోవటం వల్ల కూడా మధుమేహం అదుపులో వుంటుంది.
 
ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఆహారం అరగంట ముందు ఒక్క తిప్ప తీగ ఆకును శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా నమిలి తింటూ వుంటే 15 నుంచి 30 రోజుల్లో 1. అధిక రక్తపోటు 2. కొలెస్ట్రాల్ 3. మధుమేహం, 4. దగ్గు, ఉబ్బసం 5. పాత జ్వరాలు 6. చర్మంపై గుల్లలు, పుండ్లు, గాయాలు 7. అతి క్రొవ్వు, మూత్రావయవాల్లో రాళ్లు, మూత్రనాళంలో పుండు 8. లివర్ పెరుగుదల, ప్లీహాభివృద్ధి 9. సకల వాతనొప్పులు మొదలైనవి అదుపులోకి వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెతో కలిపి వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే..?