Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ షర్మిల ఆవిష్క‌రించిన `ఈ కథలో పాత్రలు కల్పితం`సాంగ్

Advertiesment
వైఎస్ షర్మిల ఆవిష్క‌రించిన `ఈ కథలో పాత్రలు కల్పితం`సాంగ్
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:10 IST)
Rajesh naidu, sharmila garu, Vemula satyam
పవన్‌ తేజ్‌ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల చేతుల మీదుగా ఫిబ్రవరి 12న సాయంత్రం 4గంటల 05 నిమిషాలకు విడుదల చేశారు. 
 
సాంగ్ విడుదల అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సాంగ్ చాలా బాగుందని, చిత్రం కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమైన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
 
సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసిన వైఎస్ షర్మిలగారికి చిత్రయూనిట్ తరపున హృద‌య‌పూర్వ‌క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చిత్రం చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి దర్శకుడు అభిరామ్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రాన్ని రూపొందించారు. హీరో పవన్ తేజ్ కొణిదెల లాంఛింగ్ ఫిల్మ్‌తోనే అందరినీ ఆకట్టుకుంటాడు. నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో తోడ్పడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని తెలిపారు. 
 
డైరెక్టర్ అభిరామ్ ఎమ్‌ మాట్లాడుతూ.. ‘‘అందరి సహకారంతో ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా నిర్మాత రాజేష్ నాయుడుగారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోగా పరిచయం అవుతున్న పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది. ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. తాజుద్దీన్‌ సయ్యద్ డైలాగ్స్, సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక్‌ కొడకండ్ల సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. చిత్ర సెకండ్ లిరికల్ సాంగ్‌ను ఆవిష్కరించి, మా యూనిట్‌కి అభినందనలు తెలిపిన వైఎస్ షర్మిలగారికి ధన్యవాదాలు..’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ - శంకర్ - దిల్ రాజు కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ