Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికపై మనసుపడిన మాటల మాంత్రికుడు?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (15:12 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నారు. "సన్నాఫ్ సత్యమూర్తి" తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇదే. ఈ చిత్రానికంటే ముందు 'జులాయ్' వచ్చింది. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇపుడు ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. 
 
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఈసారి పూర్తి మార్పుకోరుకుంటున్నారట. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఈసారి దేవిశ్రీ స్థానంలో ఎస్.ఎస్. థమన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. దీనికి ఫిదా అయిన త్రివిక్రమ్.. ఈ దఫా థమన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట.
 
అలాగే, హీరోయిన్ల విషయంలోనూ త్రివిక్రమ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేరును పరిశీలించిన ఆయన... చివరగా కియారా అద్వానీ, రష్మిక మందన్నాలపై దృష్టిసారించి.. చివరకు 'గీత గోవిందం' హీరోయిన్‌పై మనసుపడినట్టు సమాచారం. అయితే, హీరో, త్రివిక్రమ్ కలిసి ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments