Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెక్ట్స్ సీఎం బాలయ్య... పుకార్లా.... నిజమా?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (13:58 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో సింహా, లెజెండ్ సినిమాలు రూపొంద‌డం.. ఆ చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డం తెలిసిందే. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి హ్యాట్రిక్ సాధించేందుకు రెడీ అవుతున్నారు. 
 
ఈ భారీ క్రేజీ మూవీని ఎన్.బి.కె ఫిలింస్ బ్యానర్ పైన బాల‌కృష్ణ నిర్మిస్తున్నారు. అయితే... ఈ మూవీ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో బాల‌య్య సీఎంగా క‌నిపించ‌నున్నార‌ని. 
 
అయితే...ప్ర‌చారంలో ఉన్న వార్తపై బోయ‌పాటి క్లారిటీ ఇచ్చారు. గ‌త సంవ‌త్స‌రం బాల‌య్య‌తో సినిమా చేయాల‌నుకున్నార‌ట‌. ఆ సినిమాని పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందించాలి అనుకున్నార‌ట‌. 
 
ఆ మూవీని ఎన్నిక‌ల ముందు రిలీజ్ చేయాల‌నుకున్నార‌ట కానీ.. ఇప్పుడు ప్రారంభించే సినిమా ఎన్నిక‌ల త‌ర్వాత రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌తో ఉండ‌దు. ఇందులో బాల‌య్య సీఎంగా క‌నిపించ‌నున్నారు అనేది నిజం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు బోయ‌పాటి. అదీ..సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments