గీత గోవిందం సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగారు హీరోయిన్ రష్మిక. ఛలో సినిమాతో యావరేజ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఇప్పుడు రష్మిక కాల్ షీట్ల కోసం నిర్మాతలు, డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. అయితే రష్మిక మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తానంటోంది.
నన్ను ఎవరు కలిసినా వారిలో నేను ఒక్కటే చూస్తాను. అది నవ్వు మాత్రమే. నాకు ఏ విషయాన్నయినా నవ్వుతూ చెబితే చాలా సంతోషిస్తాను. నాకు నవ్వుతూ ఉండే వ్యక్తులకే చాలా ఇష్టమంటోంది రష్మిక. నాలో నాకు నచ్చేది కూడా నవ్వే. నేను ఎప్పుడూ నవ్వుతూనే అందరికీ సమాధానమిస్తాను.
నాలో అందరికీ నచ్చింది కూడా అదేనంటోంది రష్మిక. నవ్వుతే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే. అందుకే నాకు నవ్వడమంటే ఇష్టం. నవ్వుతూ మాట్లాడడమంటే ఇంకా ఇష్టమంటోంది రష్మిక.