Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2018 రౌండప్ : టాలీవుడ్‌పైకి దండెత్తిన కుర్రకారు హీరోయిన్లు

Advertiesment
2018 రౌండప్ : టాలీవుడ్‌పైకి దండెత్తిన కుర్రకారు హీరోయిన్లు
, మంగళవారం, 25 డిశెంబరు 2018 (10:08 IST)
ఇంతకుముందెన్నడూ లేనివిధంగా 2018 సంవత్సరంలో ఎక్కువ మంది హీరోయిన్లు టాలీవుడ్‌పైకి దండెత్తారు. అనేక మంది పరభాషల అమ్మాయిలు తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. వీరిలో కొందరు తమ నటనతో ఫిదా చేస్తే మరికొందరు తమ అందచందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా 2018 సంపత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. 
 
రష్మిక మందన్నా...
'గీతగోవిందం' చిత్రంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పేరు మార్మోగిపోయింది. ఈ చిత్రంలో ఈమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈమెకు వరుస ఆఫర్లు పలుకరిస్తున్నాయి. ఈ అమ్మడు డేట్స్ కోసం దర్శకనిర్మాతలు పడిగాపులు కాస్తున్నారంటే ఈమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
పాయల్ రాజ్‌పుత్...
యువ హీరో కార్తికేయ నటించిన చిత్రం "ఆర్ఎక్స్ 100". ఈ చిత్రం ద్వారా పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన తొలి చిత్రంలోనే బోల్డ్‌గా నటించి ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసింది. కేవలం తన గ్లామర్‌తోనేకాకుండా తన నటనతో కూడా ఫిదా చేసింది. తెలుగులో పాయల్ డెబ్యూకి పర్ఫెక్ట్ రోల్ దొరికిందని చెప్పొచ్చు. మొదటి సినిమా ఇచ్చిన ఫ్యాన్ బేస్‌తో పాయల్ తన సినీ కెరీర్‌పై దృష్టిసారించింది.
 
కైరా అద్వానీ... 
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా దర్శకుడు కొరటాల శివ పరిచయం చేసిన హీరోయిన్ కైరా అద్వానీ. తన తొలి చిత్రంతోనే ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి యేడాదిలోనే రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించిన క్రెడిట్ కొట్టేసింది.
 
అదితి రావ్ హైదరీ... 
నారా రోహిత్ నటించిన 'సమ్మోహనం' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అదితి రావు హైదరీ. ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించి శభాష్ అనిపించుకుంది. ఈ యేడాది ఆఖర్లో వరుణ్ తేజ్ సరసన 'అంతరిక్షం' చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 
 
నభా నటేష్... 
"నన్ను దోచుకుందువటే" చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ హీరోయిన్ నభా నటేష్. ఈ చిత్రంలో ఆమె తన నటనా ప్రతిభతో మేజిక్ చేసింది. ఆ తర్వాత ఆమె ఎక్కడా వెనక్కి తిరిగిచూడలేదు. డెబ్యూ మూవీ ఇచ్చిన ఎనర్జీతో అనేక చిత్రాల్లో నటించే అవకాశాన్ని నభా నటేష్ కొట్టేసింది. 
 
రుహానీ శర్మ... 
సాధారణంగా హీరోయిన్ అంటే కేవలం ఆటపాటలకు అందాల ఆరబోతకు మాత్రమే అనే టాక్ ఉంది. కానీ, రుహానీ శర్మ ఇందుకు మినహాయింపు అని నిరూపించింది. తొలి చిత్రం అంటే గ్లామర్ ఆరబోయాలన్న షరతును ఈమె సడలించింది. "చిలసౌ" అనే చిత్రంలో ఒక్క సీన్‌లో కూడా ఎక్కడా కూడా అశ్లీలంగా, అసభ్యంగా కనిపించకుండా నటించింది. 
 
నిధి అగర్వాల్...
అక్కినేని నాగచైతన్య నటించిన చిత్రం "సవ్యసాచి". ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించింది. ఈమె తన తొలి చిత్రంతోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పాల మీగడలాంటి సొగసుతో తాను నిధి అగర్వాల్ కాదనీ.. అందాల నిధి అగర్వాల్ అని నిరూపించుకుంది. ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో 'మిస్టర్ మజ్ను' అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే, మరికొందరు నిర్మాతలు కూడా ఆమె కోసం వేచిచూస్తున్నారు. 
 
ప్రియాంకా జవాల్కర్...
టాలీవుడ్ సంచలం విజయ్ దేవరకొండ నటించిన "టాక్సీవాలా" చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్. ఈమె తొలి చిత్రంలోనే మంచి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రం ఆమెకు నిరాశపరిచినప్పటికీ... ప్రియాంకా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 
అలాగే, 'గూఢచారి' చిత్రంతో తెలుగు అమ్మాయి శోభిత ధూలిపాళ్ళ, రవితేజ నటించిన 'నేలటిక్కెట్టు' చిత్రంతో మాళవిక శర్మలు తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో 'గూఢచారి' మంచి విజయం సాధించగా, 'నేలటిక్కెట్టు' ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇంకా పలువురు హీరోయిన్లు వెండితెరకు పరిచయమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2018 మూవీ రౌండప్ : కెరటంలా దూసుకొచ్చిన దర్శకులు