Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'తొలిప్రేమ' హీరోతో 'గీతగోవిందం' హీరోయిన్...

'తొలిప్రేమ' హీరోతో 'గీతగోవిందం' హీరోయిన్...
, ఆదివారం, 2 డిశెంబరు 2018 (10:54 IST)
"ఛలో" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న. "గీతగోవిందం" చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ ఒక్క చిత్రంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో రష్మికకు తెలుగులో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. 
 
అయితే, 'గీతగోవిందం' తర్వాత వచ్చిన దేవదాస్ చిత్రంలో నానికి జంటగా నటించింది. కానీ, ఈ చిత్రం నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ అమ్మడుకి ఆఫర్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు నిర్మాతలు క్యూకడుతున్నారు. అయితే, దీంతో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక.. తనకు కథ నచ్చితేనే నటిస్తానంటూ నిర్మాతలకు తెగేసి చెబుతోంది. 
 
ఈనేపథ్యంలో రష్మిక మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. 'ఫిదా', 'తొలిప్రేమ'తో విజయాలు అందుకున్న వరుణ్‌తేజ్‌తో రొమాన్స్ చేసేందుకు రష్మిక సిద్ధమవుతోంది. సిద్దార్ధ, లక్ష్మీమీనన్ జంటగా 2016లో వచ్చిన తమిళ చిత్రం 'జిగర్‌తండ'ను హరీష్ శంకర్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రష్మిక ఆడపాడనుంది. రష్మిక ప్రస్తుతం విజయ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది.
 
సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌తో మొదలై గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. తొలి చిత్రం 'పిజ్జా'తో తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం అందుకున్న కార్తీక్ సుబ్బరాజు 'జిగర్‌తండ'కు దర్శకత్వం వహించారు. 
 
అయితే ఈ సినిమా తెలుగులో 'చిక్కడు దొరకడు' పేరుతో గతంలోనే డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా థియేటర్లకు ఎప్పడొచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ తెలీదు. ఇలాంటి చిత్రాన్ని హరీష్ శంకర్ రీమేక్ చేయాలనుకోవడం సాహసమే అని చెప్పాలి. అసలే ప్లాపులతో సతమతమవుతున్న ఈ 'గబ్బర్‌సింగ్' డైరెక్టర్ ఎంత మేరకు సఫలమవుతాడో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా లెహంగా ధర రూ.8 కోట్లు.. పెళ్లి ఖర్చు రూ.70 కోట్లు