Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం క‌థ ఇదేనా..?

Advertiesment
వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం క‌థ ఇదేనా..?
, శుక్రవారం, 30 నవంబరు 2018 (10:27 IST)
వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం 9000 కెఎంపిహెచ్. ఈ చిత్రాన్ని ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ డిసెంబర్ 21 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా క‌థ ఏంటి అని. సౌత్‌లో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు రిలీజవుతున్నాయి. 2.O తర్వాత జోనర్ పరంగా మళ్లీ అంత పెద్ద ప్రయోగమే ఇది. అందుకే అంతరిక్షం సినిమా కథేంటి? అనే క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యింది.
 
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్ర ఎంతో ఛాలెంజింగ్‌గా ఉంటుందట. ఉద్యోగం కోల్పోయిన ఓ యువ స్పేస్ సైంటిస్ట్ అత్యవసర సన్నివేశంలో భారతదేశాన్ని కాపాడేందుకు తిరిగి విధులకు హాజరవుతాడు. ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ ఏంటి.? అసలు ఇండియాకి ఎలాంటి ప్రమాదం ఎదురైంది? అనేదే ఈ సినిమా క‌థ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

వింటుంటే చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. అతిదీరావ్ హైదరీ - లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికలుగా న‌టించారు. ఓవైపు స్పేస్‌లో ఉత్కంఠ కలిగించే సీరియస్ డ్రామా నడిపిస్తూనే - మరోవైపు ప్రేమకథను నడిపించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇదే క‌నుక నిజ‌మైతే అంత‌రిక్షం అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌డం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు, ప్ర‌భాస్ ఒకే రోజున వ‌స్తున్నారా..?