గీత గోవిందం సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. 2018 సౌత్ ఇండియన్ మోస్ట్ గూగుల్డ్ సర్చ్ హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా తన గూగూల్డ్ హీరోయిన్ స్టేటస్‌పై రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ స్టేటల్‌కు కేవలం అదృష్టమే కారణమని చెప్తోంది.
అంతేకాదు చాలామంది గూగుల్ సర్చ్‌లో తన గురించి ఎందుకు వెతికారో తెలియదని చెప్పుకొచ్చింది. తాను సాధారణ అందంతో పాటు సాధారణ అభినయాన్ని మాత్రమే కలిగివున్నానని అణకువగా బదులిచ్చింది.
షూటింగ్ సమయంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేక పోయేదాన్ని అని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. తాను ఈ స్థాయికి ఎదుగుతానని కలలో కూడా అనుకోలేదని.. షాకింగ్ కామెంట్స్ చేసింది.
అంతేకాదు ఎవరైనా తనను హీరోయిన్, మేడమ్, యాక్ట్రెస్ అనే పదాలతో పిలిస్తే తనకు భయమేస్తుందని.. అందుకే తనను పేరు పెట్టి పిలవమని అడుగుతానని రష్మిక తెలిపింది. ఇప్పటికీ తనకు ఏర్పడిన సెలెబ్రెటీ స్టేటస్‌ను అంగీకరించలేకపోతున్నానని రష్మిక వెల్లడించింది.