Webdunia - Bharat's app for daily news and videos

Install App

నొప్పించాలనుకున్నారు.. సక్సెస్ అయ్యారు : రష్మిక మందన్నా (video)

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (12:51 IST)
తనను ట్రోల్ చేసిన నెటిజన్లపై కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్ను నొప్పించాలనుకున్నారు.. సక్సెస్ అయ్యారు అంటూ సుతిమెత్తని హెచ్చరికలు చేసింది. 
 
సెల‌బ్రిటీల‌ని ట్రోల్ చేస్తుండ‌డం కొత్తేమి కాదు. కాని అవి శృతిమించితేనే ఇబ్బంది. చాలా విష‌యాల‌లో ఎంతో ఓపిక‌తో ఉండే సెల‌బ్రిటీలు ఒక్కోసారి నెటిజ‌న్స్ చేసే ట్రోల్స్‌కి ఆగ్ర‌హంతో ఊగిపోతుంటారు. తాజాగా ర‌ష్మిక త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజ‌న్‌కి చుర‌క‌లు అంటించింది. 
 
ఇటీవల ర‌ష్మిక చిన్న‌నాటి ఫోటోల‌ని జ‌త చేస్తూ.. ఎవ‌రైన ఊహించారా? ఈ చిన్న‌పిల్ల ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో.. అంటూ ప‌లు అసభ్య‌క‌ర‌మైన కామెంట్స్ పోస్ట్ చేశారు. వీటిని చూసిన రష్మికకు చిర్రెత్తుకొచ్చింది. అంతే... ఒక్కసారిగా తనను ట్రోల్ చేసిన నెటిజన్లను ఏకిపారేసింది. 
 
న‌టీన‌టుల మీద ట్రోల్స్ చేస్తే మీకు ఏమోస్తుందో మాకు అర్ధం కావ‌డం లేదు. సెల‌బ్రిటీల అయినంత మాత్రాన మ‌మ్న‌ల్ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం క‌రెక్టా? మేము ఏం అనం అనే క‌దా మీ ధైర్యం. వ‌ర్క్ విష‌యంలో మ‌మ్మ‌ల్ని కామెంట్స్ చేయోచ్చు, త‌ప్పులేదు. కాని ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌పై మాట్లాడే రైట్ మీకు ఎవ‌రు ఇచ్చారు. చాలా మంది ఇలాంటి కామెంట్స్ ప‌ట్టించుకోవ‌ద్దు అని చెబుతుంటారు.

కాని ఇలాంటి చెత్త విమ‌ర్శ‌లకి స‌మాధానం ఇవ్వ‌కుండా ఎలా ఉంటాం. న‌టులు అవ్వ‌డం అంటే అంత ఈజీ కాదు. ప్ర‌తిఇ వృత్తిని అందరూ గౌరవించాలి. కానీ అన్నింటికంటే ముందు ఒకరినొకరు గౌరవించడం మొదలుపెట్టాలి. ఈ పోస్ట్‌ ఎవరు పెట్టారో వాళ్లకు కంగ్రాట్స్‌. మీరు నన్ను నొప్పించాలనుకున్నారు. సక్సెస్‌ అయ్యారు’’ అని రష్మికా మందన్నా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు , భీష్మ చిత్రాల‌లో న‌టిస్తుంది ర‌ష్మిక.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments