Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

ఆ హీరోకు 13 ముద్దులిచ్చేందుకు సిద్ధమన్న రష్మిక?

Advertiesment
Rashmika Mandanna
, శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:43 IST)
గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రష్మిక మందన. ఈమె పేరు వింటేనే ప్రేక్షకులకు గీత గోవిందం సినిమానే గుర్తుకు వస్తుంది. అయితే ఆ తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించక పోగా రష్మికకు కూడా తెలుగులో అవకాశాలు తక్కువవుతూ రావడానికి కారణమైంది కూడా.
 
అయితే బాలీవుడ్లో మాత్రం రష్మికకు మంచి ఛాన్స్ వచ్చిందట. అది కూడా షాహిద్ కపూర్‌తో నటించడానికి.. జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు సిద్థమయ్యారు దిల్ రాజు, అల్లు అరవింద్‌లు. సినిమా ఇప్పటికే తెలుగులో భారీ విజయాన్ని సాధించింది. సహజ నటుడు నాని మరింత సహజంగా నటించి అందరినీ మెప్పించారు. అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమైన దర్సకుడు గౌతమ్ తిన్ననూరి, హీరో షాహిద్ కపూర్‌ను ఖరారు చేసుకున్నారు. 
 
కథ అటు ఇటు మార్చి సినిమాను తెరకెక్కించుబోతున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉన్న షాహిద్ ఈ సినిమాకు ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటగా మృణాల్ ఠాగూర్‌ను సెలక్ట్ చేశారట. అయితే నిర్మాతలు దిల్ రాజు, అల్లుఅరవింద్‌లు మాత్రం రష్మిక అయితే సరిగ్గా సరిపోతుందని, తెలుగులో జెర్సీ హీరోయిన్ పాత్రకు రష్మిక ఒకటే  న్యాయం చేస్తుందంటున్న అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలు. దీంతో రష్మికకు ఒక మంచి ఛాన్స్ వచ్చినట్లని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
 
ఇదిలా ఉంటే హిందీ రీమేక్ జెర్సీ సినిమాలో 13కి పైగా అదర చుంబనాలు హీరోహీరోయిన్లకు మధ్య ఉంటుందని దర్సకుడు చెప్పారట. కథను బట్టి అక్కడక్కడ ఈ సీన్లు పెట్టాలని నిర్ణయానికి వచ్చారట. మొదట్లో రష్మిక ఆలోచించినా కథ కాబట్టి.. చివరకు ఒకే అందట. అది కూడా షాహిద్ కపూర్ లాంటి హీరో కావడంతో ఆమె ఒప్పుకున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 రోజులు పూర్తిచేసుకోనున్న ఇస్మార్ట్ శంకర్, పూరీకి చార్మి పార్టీ