Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్యూషన్ మాస్టర్ మాటల మాంత్రికుడయ్యాడు.. భీష్మ నుంచి ఫస్ట్ గ్లింప్స్ (Video)

Advertiesment
Bheeshma
, గురువారం, 7 నవంబరు 2019 (13:26 IST)
నితిన్ తాజా సినిమా "భీష్మ" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.. భీష్మ (సింగిల్ ఫరెవర్). పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ''భీష్మ'' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
 
‘నా లవ్ విజయ్ మాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’.. అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ బాగుంది. రష్మిక నడుము చూస్తూ ఆమెని ఫాలో అవడం, ఆమె తన వైపు తిరగ్గా నడుమును పట్టుకోబోతూ.. చింపేశారు అన్నట్టు నితిన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ని స్ఫూర్తిగా తీసుకున్నాడేమో కానీ అచ్చు అదే స్టైల్‌లో మ్యాజిక్ చేశాడు నితిన్. 
 
2020 ఫిబ్రవరి 21న భీష్మ విడుదల కానుంది.. నరేష్, సంపత్, రఘబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : మహతి స్వరసాగర్. 
 
మాటల మాంత్రికుడికి పుట్టిన రోజు.. 
మాటల మాంత్రికుడిగానే కాకుండా దర్శకుడిగా ఖలేజా చూపి తెలుగుతెరపై రాణిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఆయ‌న క‌లం నుంచి ఏదైనా ప‌దం జాలు వారితే అది మ‌న‌కు ఊత‌ప‌దం అవుతుంది.. ఆయ‌న మ‌న‌సుపెట్టి మాట రాస్తే అది మ‌న‌కు మ‌రిచిపోలేనంత‌గా గుర్తుండిపోతుంది. త‌న మాట‌ల‌తో మాయ చేయ‌డం.. ఎంత పెద్ద సీన్ అయినా కేవ‌లం మాట‌ల‌తో క‌న్విన్స్ చేయ‌డం అతని స్పెషాలిటీ. 
webdunia
 
తనదైన మాటల మాయాజాలంతో  ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న  త్రివిక్రమ్ శ్రీనివాస్, 1972 నవంబర్ 7న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించాడు. అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. ఆ తరువాత కొన్నిరోజులు ట్యూటర్‌గా పనిచేశాడు.
 
ఈ క్రమంలో ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. ఆ పరిచయం త్రివిక్రమ్‌ను సినిమాల వైపు నడిపించింది. ప్రముఖ రచయత పోసాని దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేసాడు. ఆ తర్వాత వేణు హీరోగా, కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన స్వయంవరం సినిమాతో మాటల రచయతగా కెరీర్ స్టార్ట్ చేసాడు. 
 
ఈ సినిమా తర్వాత విజయభాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన నువ్వే కావాలి సినిమాతో ఆయనలోని రాతగాడు మరింత పదును తేలాడు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌‍లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మన్మథుడు, మల్లీశ్వరి సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి బంపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాల సక్సెస్‌తో టాలీవుడ్ టాప్ రైటర్లలో ఒకడిగా నిలిచాడు.
webdunia
 
ఇక పవన్ కళ్యాణ్‌తో గతేడాది చేసిన అజ్ఞాతవాసితో విమర్శపాలైనా.. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇపుడు అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. రచయతగానే ఎన్నో అద్భుత విజయాలను అందుకున్న ఈ మాటల మాంత్రికుడు.. దర్శకుడిగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నట కమలం కమల్ హాసన్‌కు పుట్టిన రోజు.. భారతీయుడు2తో వచ్చేస్తున్నాడు.