Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నట కమలం కమల్ హాసన్‌కు పుట్టిన రోజు.. భారతీయుడు2తో వచ్చేస్తున్నాడు.

Advertiesment
నట కమలం కమల్ హాసన్‌కు పుట్టిన రోజు.. భారతీయుడు2తో వచ్చేస్తున్నాడు.
, గురువారం, 7 నవంబరు 2019 (12:50 IST)
వెండితెరపై విశ్వరూపం చూపిస్తున్న నట కమలం కమల్ హాసన్‌కు నేడు పుట్టిన రోజు. దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భారతీయుడు. ప్రయోగాలు, విభిన్నపాత్రలకు కమల్ హాసన్ నాయకుడు. తన యాక్టింగ్‌తో ఆడియన్స్‌కు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు. భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. 
 
కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇపుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మరోచరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు, శుభ సంకల్పం వంటి  సినిమాలు చేశాడు. తెలుగులో ఆయన చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు.
 
కలత్తూర్ కన్నమ్మ అనే సినిమాతో బాలనటుడిగా ప్రారంభమైన కమల్ సినీ ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది.  ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే.. త్వరలో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క పుట్టిన రోజు.. నిశ్శబ్ధం టీజర్ రిలీజ్..