Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క పుట్టిన రోజు.. నిశ్శబ్ధం టీజర్ రిలీజ్..

Advertiesment
Happy Birthday Anushka Shetty
, గురువారం, 7 నవంబరు 2019 (11:59 IST)
యోగా టీచర్ అనుష్క పుట్టిన రోజు నేడు. సింగం, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె పాత్రల్లో మాములుగా ఈ భామ నటించడం కాదు.. జీవిస్తుంది. ఆ పాత్రకే నిండుదనం తెస్తుంది. 
 
ఇక బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ రోజు అనుష్క శెట్ట పుట్టినరోజు. 1981లో పుట్టిన ఈ భామ‌.. ఈ ఏడాదితో 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏజ్ 35 దాటినా ఇప్పటికీ క్రేజ్ తగ్గని అతికొద్ది హీరోయిన్స్‌లో అనుష్క ఒకరు. ఈ యేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ‘ఝన్సీ లక్ష్మీబాయి’గా కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో "నిశ్శబ్ధం" అనే  సినిమా చేస్తోంది. 
 
ఈ  సినిమాలో అనుష్క చెవిటి, మూగ అయిన బధిర యువతి పాత్రను పోషిస్తోంది. మరో కథానాయిక అంజలి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాలినీ పాండే, మాధవన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
 
ఇక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్రలో న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న అనుష్క పుట్టిన‌రోజును పురస్కరించుకుని ‘నిశ్శబ్దం’ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 
 
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్రముఖ ద‌ర్శకుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్టర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు. ఇప్పటికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ప్రీ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచ‌గా.. ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సూర్య చిత్రంలో నటించి పెద్ద తప్పు చేశా: నయనతార