సీఎం జగన్ మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చిన నటి శ్రీరెడ్డి.. మరి జగన్ వింటారా?

సోమవారం, 14 అక్టోబరు 2019 (11:12 IST)
ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఈసారి రూటు మార్చించి. సినిమా ఇండ్రస్ట్రీ కేంద్రంగా సెన్సేషనల్ కామెంట్స్ పెడుతూ వేడివేడి చర్చలకు వేదికగా నిలిచే శ్రీరెడ్డి ఈసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చింది. మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిస్తే మీ వెనుక ఎప్పుడూ తాను ఉంటానని చెబుతూనే కొన్ని సలహాలు సూచనలు చేసింది శ్రీరెడ్డి. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని, ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరా మీద దృష్టి పెట్టాలని సూచించింది. అందుకోసం అవసరమైతే అంబానీల సాయం తీసుకోవాలని కోరింది. అంతేకాదు రాష్ట్రంలో గ్రీన్ సిటీస్ అభివృద్ధి చేయడం ద్వారా టూరిజం అభివృద్ధి చెందుతుందని చెప్పింది. 
 
పారిశ్రామికాభివృద్ధి, రైతుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకలాంటివని, వీలైనంత త్వరగా రాష్ట్రంలో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తే మెజారిటీ సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఫేస్‌బుక్ వేదికగా జగన్‌కు సలహాలు అందించింది శ్రీరెడ్డి. ‘జగన్ అంటే, జనం’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. నిన్నటికి నిన్న సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మీద విరుచుకుపడ్డ శ్రీరెడ్డి ఈ రోజు జగన్‌కు సలహాలు ఇవ్వడం విశేషం..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కోస్తా వరకు ఉపరితలద్రోణి