లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించింది. ఆగ్నేయ/దక్షిణ దిశ నుంచి కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది.
దీంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో రానున్న వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.