Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ఆంటీనారా? నీ కళ్ళలో కారం జల్ల... బాలుడిపై నటి బూతులు

Advertiesment
నేను ఆంటీనారా? నీ కళ్ళలో కారం జల్ల... బాలుడిపై నటి బూతులు
, బుధవారం, 6 నవంబరు 2019 (16:04 IST)
ఓ నాలుగేళ్ళ బాలుడుపై బాలీవుడ్ నటి బూతులు తిట్టింది. ఆ బాలుడు చేసిన తప్పు ఏంటంటే.. ఆ నటిని ఆంటీ అని పిలవడమే. ఆ హీరోయిన్ పేరు స్వరా భాస్కర్. కేరీర్ ఆరంభం నుంచే వివాదాస్పద నటిగా గుర్తింపు పొందింది. 
 
ఈమె తాజాగా 'సన్ ఆఫ్ అభీష్' చాట్ షోలో పాల్గొంది. తన కెరీర్ అరంభంలో జరిగిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ గురించి మాట్లాడింది. నాలుగేళ్ల చిన్నారితో కలిసి స్వరా ఆ యాడ్‌లో నటించింది.
 
ఆ యాడ్ షూటింగ్ సందర్భంగా ఆ బాలుడు స్వరాను 'ఆంటీ' అని పిలిచాడట. దానిని గుర్తు చేసుకున్న స్వరా ఆ బాలుణ్ని నోటికొచ్చినట్టు బూతులు తిట్టింది. ఆ షూటింగ్ తనకు చాలా నిరాశ కలిగించిందని, బాలుడు తనను 'ఆంటీ' అని పిలవడమేంటని ప్రశ్నించింది. 
 
అంతేకాదు 'పిల్లలు దెయ్యాలతో సమానం కదా?' అంటూ వ్యాఖ్యానించింది. స్వర చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని కెమెరా ముందు దారుణంగా తిట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వరా వ్యాఖ్యలపై ఓ స్వచ్ఛంద సంస్థ ఏకంగా జాతీయ బాలల హక్కు కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానా లాంటి కుర్రోడు ఎక్కడున్నాడు... డేటింగ్‌పై రకుల్ స్పందన