Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన అవసరం : డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన అవసరం : డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
, గురువారం, 31 అక్టోబరు 2019 (15:41 IST)
బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడం వల్ల చాలావరకు నష్టాలను నివారించవచ్చని, దీనివల్ల జీవితములో అభివృద్ధితోపాటు సమాజానికి కూడా ఉపయోగం ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. 
విజయవాడలో బందరు రోడ్డులో మురళి ఫార్చ్యూన్‌లో గురువారం ఉదయం 7వ రాష్ట్రా స్థాయి ఖురాన్ కంటస్థ పోటీల గోడపత్రిక ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలతో పాటు ఇతరులు కూడా ఈ పోటీలలో పలుగోవటం భారతదేశ లౌకికవాదం నికి నిదర్శనం అన్నారు. సోషల్ మీడియాకు నేడు యువత బానిసలుగా మరి విలువైన జీవితాలు నాశనం చేసుకోవటం విచారకరమన్నారు. ప్రతి రోజు తమ ఇష్ట దైవం గ్రంథ పఠించటము వలన చెడు వ్యసనాలకు దూరం ఉండవచ్చు అన్నారు. 
 
గత 6 సంవత్సరాలుపైగా యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురాన్ స్టడీస్ కృషి అభినందనియం అన్నారు. సుమారు 52 వేల మంది ఈ పోటీలలో పాలుగోనటంపై సంతోషం వ్యక్తపరిచారు. దైవభితితో జవాబు దారి తనముతో పని చేసి సుందర సమాజము స్థాపించవచ్చు అన్నారు. ఖురాన్‌ ప్రధానాశంమంతా మానవుడి చుట్టూ తిరుగుతుంది. మనిషి జన్మ, మరణం.. ఇహపరలోక జీవితం.. వర్తమాన కాలాల గురించి మనిషికి మార్గం చూపుతుందన్నారు. 
 
ఎంతచదివినా ఆసక్తి తరగని గ్రంథం ఖురాన్. నమాజు చేస్తున్నప్పుడు ఖురాన్‌లోని సూరాలు పఠిస్తారు. దానం, మృదుభాషణం, క్షమాగుణం, కృతజ్ఞత, కోపాన్ని దిగమింగడం వంటి సద్గుణాలెన్నో ఈ గ్రంథం బోధిస్తుందని అన్నారు. ఆటో మొబైల్ టెక్నీషియన్ అధ్యక్షుడు రాజనాల బాబ్జి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. 
 
యునైటెడ్ ఖురాన్ పోరం ఫర్ స్టడీస్ అధ్యక్షులు దావూద్ మాట్లాడుతూ, కొన్ని వేల మంది చిన్నారులను దైవ మార్గంలో నడిపించటంతో పాటు వారికి మంచిని నేర్పడం ద్వారా సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయటంలో దైవగ్రంథం ఉపయోగం వెలకట్టలేనిది అన్నారు. 13 జిల్లాల నుండి పెద్ద ఎత్తున చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని సుమారు ఈ సంవత్సరం ఒక లక్ష మంది వరకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో మూడు నెలల్లో పంచాయతీ సమరం : హైకోర్టుకు నివేదిక