Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌కి పిలిచారు... వచ్చేసానుంటున్న రష్మిక

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:37 IST)
విజయ్‌ దేవరకొండకు జోడీగా ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం కార్తీ కథానాయకుడిగా ‘రెమో’ ఫేం బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలోని కథానాయిక పాత్రతో తమిళ పరిశ్రమలోకి అడుగిడబోతోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రష్మికకి తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారంనాడు ప్రారంభమైంది.
 
ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రష్మిక..  ‘నన్ను నటిగా కన్నడ, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. 2019వ సంవత్సరంలో కోలీవుడ్‌కు రమ్మని మీరూ అడిగారు (కోలీవుడ్‌ ఫ్యాన్స్‌), చివరికి వచ్చేసాను. మీకు నా అమితమైన ప్రేమను పంపుతున్నా. కార్తీ, తదితర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె పోస్ట్‌ చేసారు.
 
అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథనాయకుడిగా నటిస్తున్న భీష్మ సినిమాలోనూ రష్మిక కథానాయిక పాత్ర పోషించబోతున్నారు. తాజాగా మహేష్‌బాబు-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు కూడా రష్మిక సంతకం చేసినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments