జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

దేవీ
సోమవారం, 17 నవంబరు 2025 (16:05 IST)
Raveena Tandon's daughter Rasha Tandon
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
 
అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా మనసుకు హత్తుకునే ప్రేమకథ ప్రధానంగా ఉంటుంది. భావోద్వేగాలు, నిజాయితీ, రియలిజం కలగలిపిన ఈ సినిమా కొత్త తరహా ప్రేమకథగా ఉండబోతుంది. ఈ చిత్రాన్ని కొన్నిరోజుల క్రితం ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు మేకర్స్ జయ కృష్ణ ఘట్టమనేని సరసన హీరోయిన్ గా నేషనల్ సెన్సేషన్ రషా తడానిని అఫీషియల్ వెల్కమ్ చేశారు.
 
రషా, హీరోయిన్ రవీనా టండన్, ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూసర్, AA Films India యజమాని అనిల్ తడాని కుమార్తె.
 
రషా అజాద్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, “Uyi Amma” పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఇప్పుడు #AB4 ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
 
తన చిత్రాల్లో మహిళా పాత్రలకు బలమైన క్యారెక్టరైజేషన్స్ రాసే దర్శకుడు అజయ్ భూపతి, రషా కోసం ఇంటెన్స్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు.
 
ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే రివిల్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments