Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

Advertiesment
ravina - rasha tondon

ఠాగూర్

, ఆదివారం, 5 అక్టోబరు 2025 (16:43 IST)
తన కుమార్తె రషా తడానీలో ఏదో ఒక లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉంటుందేమోననిపిస్తోందని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఆన్‌లైన్ మీడియాతో మాట్లాడుతూ, కూతురి బాల్యం నుంచి ఆమె సినీ రంగ ప్రవేశం వరకు అనేక విషయాలను పంచుకున్నారు. రషా కేవలం మూడు, నాలుగు నెలల వయసు నుంచే విభిన్నమైన హావభావాలు ప్రదర్శించేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
 
'రషా చిన్నప్పుడు అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నట్లుగా నటించేది. అంత చిన్న వయసులో అద్దంలో తన హావభావాలను చూసుకోవాలని ఎలా అనిపించిందో అర్థమయ్యేది కాదు. తనలో ఎవరో గొప్ప నటి ఆత్మ  ఉండివుంటుంది అని మా అమ్మతో ఎప్పుడూ అనేదాన్ని. అప్పుడు ఆమె నా మాటలను పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు రషా నటన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది' అని రవీనా తెలిపారు.
 
తన వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రషా, 'ఆజాద్' అనే తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో ఆమె డ్యాన్స్, హావభావాలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించి, దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకున్నాయి. ఇంత తక్కువ సమయంలో రషాకు ఇంతటి విజయం వస్తుందని తాము ఊహించలేదని, ఆమెను చూసి ఎంతో గర్వపడుతున్నామని రవీనా చెప్పారు. 
 
చిన్నప్పుడు రాక్ స్టార్ అవ్వాలనుకున్న రషా, ఆ తర్వాత తన తల్లిలాగే స్టార్ హీరోయిన్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుందని ఆమె వెల్లడించారు. ఇక రషా తడానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు రమేశ్ బాబు తనయుడు, ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయంకానున్న చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాతో రషా టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు