Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

Advertiesment
sandhya shantaram

ఠాగూర్

, ఆదివారం, 5 అక్టోబరు 2025 (14:45 IST)
ప్రముఖ బాలీవుడ్ సినీ నటి, దిగ్గజ దర్శకుడు వి.శాంతారామ్ సతీమణి సంధ్యా శాంతారామ్ (94) కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆమె మరణం పట్ల చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
 
సంధ్యా శాంతారామ్ సినీ రంగంలో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేశారు. ఆమె హిందీతో పాటు మరాఠీ భాషలో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 'అమర్ భూపాలి', 'ఝనక్ ఝనక్ పాయల్ భాజే', 'నవరంగ్', 'పింజారా' వంటి చిత్రాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు, ముఖ్యంగా ఆమె నృత్య ప్రదర్శనలు ఆమెను కలల నటిగా నిలిపాయి. నృత్యకళలో ఆమె చూపిన ప్రత్యేక ప్రతిభ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
 
సంధ్యా శాంతారామ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత మధుర్ భండార్కర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "లెజెండరీ నటి సంధ్యా శాంతారామ్ ఇకలేరు అనే వార్త బాధాకరం. ఆమె జీవితం, పాత్రలు, ప్రదర్శనలు అన్నీ భారతీయ సినిమాకు గర్వకారణం. ఆమె నటించిన చిత్రాల్లోని ఐకానిక్ రోల్స్ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి" అంటూ నివాళులర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్