Thopudurthi Bhaskar Reddy
వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నాన్న తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే... శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తూ భాస్కర్ రెడ్డి ఆకస్మికంగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతపురం వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు