Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Advertiesment
Nandamuri Balakrishna, Samyukta

దేవీ

, సోమవారం, 17 నవంబరు 2025 (15:57 IST)
Nandamuri Balakrishna, Samyukta
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి.  
 
మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. అఖండ 2 సెకండ్ సింగిల్ 'జాజికాయ' నవంబర్ 18న గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారు. ఈ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ గా ఉండబోతోంది. తమన్ థియేటర్స్ దద్దరిల్లే పాటని కంపోజ్ చేశారు.
 
గ్రాండ్ సెట్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ ని అద్భుతంగా అలరించనున్నాయి. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో బాలయ్య ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది.
 
వైజాగ్ జగదాంబ థియేటర్ లో గ్రాండ్ గా జరగనున్న సాంగ్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణ తో పాటు చిత్ర యూనిట్ హాజరుకానున్నారు.
 
ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌.  
 
‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
DOP: C రాంప్రసాద్, సంతోష్ D Detakae
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !