Businessman - Mahesh Babu
2012లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన “బిజినెస్‌మ్యాన్” సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ అందించిన బీట్స్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తూ, బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సింహం “సూర్య భాయ్” పవర్‌కి సింబల్‌గా నిలిచింది.
పోస్టర్‌పై ఉన్న “Surya Bhai Roar Resurrects – November 29th in Theaters” అనే లైన్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. బిజినెస్‌మ్యాన్ సినిమాకు సంగీతం అందించిన ఎస్‌ఎస్ థమన్ మాస్ బీట్‌లతో ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు. ఆయన అందించిన ప్రతి పాట కూడా సినిమాకి ఎనర్జీని పెంచుతూ, మహేష్ బాబు స్టైల్‌కి సరిపోయే విధంగా సెట్ అయ్యింది.
నిర్మాత డా. వెంకట్ ఆధ్వర్యంలోని R R Movie Makers ఈ చిత్రాన్ని అత్యంత విలువైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. అద్భుతమైన టెక్నికల్ స్టాండర్డ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మెగా ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “బిజినెస్‌మ్యాన్” దేశవ్యాప్తంగా — అల్ ఓవర్ గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. మహేష్ బాబు చిన్నప్పటి నటుడిగా నటించిన మొదటి సినిమా "నీడా" (1979) నవంబర్ 29న తేదీ నాదే మళ్లీ బిజినెస్‌మ్యాన్ సినిమా ని రిలీజ్ చేస్తున్నాం అని మెగా ప్రొడక్షన్స్ సంస్ధ తెలిపారు.
ఖలేజా రీ-రిలీజ్ విజయంతో ఉత్సాహం నింపుకున్న మెగా ప్రొడక్షన్స్, ఈసారి మరింత విస్తృతంగా స్క్రీన్లు పెంచి, సూర్య భాయ్ గర్జనను దేశమంతా వినిపించడానికి సిద్ధమవుతున్నారు.