Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో సినిమా రీ షూట్: వేసవి కానుకగా ''రంగస్థలం"

రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైం

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (12:41 IST)
రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైంది. కానీ ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోందని వార్తలొస్తున్నాయి. సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని పక్కాగా వుండాలని కోరుకుంటాడు.
 
అయితే కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ షూటింగ్ చేస్తున్నారని  తెలిసింది. ఇందుకోసం చెర్రీ డేట్స్ కూడా ఇచ్చాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ సూచనల మేరకు సుకుమార్ కొన్ని సీన్లను మళ్లీ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
 
1985 కాలం నాటి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఇక రీ షూటింగ్‌ను ఈ నెల చివరిలోపు పూర్తి చేసి.. చెర్రీ వచ్చేనెలలో బోయపాటి సినిమా షూటింగులో పాల్గొంటారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments