రాజమౌళి-చెర్రీ-ఎన్టీఆర్ సినిమాకు టైటిల్ ఇదే..

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఎన్టీఆర్-చెర్రీతో కలిసి వున్న ఫోటోను రాజమౌళి షేర్ చేయడం ద్వారా ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారని జోరుగా ప్రచారం సా

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (15:06 IST)
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఎన్టీఆర్-చెర్రీతో కలిసి వున్న ఫోటోను రాజమౌళి షేర్ చేయడం ద్వారా ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు  రూ.400కోట్లకు పైగానే వుంటుందని టాక్ వచ్చింది. 
 
తాజాగా ఈ సినిమా రూపొందితే రాజమౌళి ఎలాంటి టైటిల్ పెడతారనే దానిపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి ''యమధీర'' అన్న టైటిల్ పెట్టాలని అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
యమదొంగ చిత్రం నుంచి యమను.. మగధీర చిత్రం నుంచి ధీరను కలిపి వారు సూచిస్తున్న పేరు బాగానే ఉంది కానీ దాన్ని జక్కన్న ఏ మేరకు పరిశీలిస్తారనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు జోడీగా అనూ ఇమ్మానుయేల్ ఎంపికైందని.. చెర్రీ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ సినిమా 2018 సమ్మర్లో ప్రారంభం అవుతుందని, ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ సోదరులుగా కనిపిస్తారని, బాక్సర్లుగా నటిస్తారని తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమాకు కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తారని సమాచారం. చెర్రీ ప్రస్తుతం రంగస్థలం 1985లో నటిస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments