Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నజాజిలా మారిన అనుష్క... ఎవరికోసం?

వెండితెర దేవసేన అనుష్క. ఈ ముద్దుగుమ్మ సన్నజాజిలా మారింది. దీనికి సంబంధించి కొత్త ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె చాలా నాజూకుగా, సరికొత్త హెయిర్ కట్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ ఫోటో కింద"ఏదో అద

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (14:28 IST)
వెండితెర దేవసేన అనుష్క. ఈ ముద్దుగుమ్మ సన్నజాజిలా మారింది. దీనికి సంబంధించి కొత్త ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె చాలా నాజూకుగా, సరికొత్త హెయిర్ కట్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ ఫోటో కింద"ఏదో అద్భుతం జరగడం వల్ల కలలు నెరవేరవు, దాని కోసం చెమట చిందించాలి, అంకితభావంతో కృషి చేయాలి" అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫొటో చూసిన అభిమానులు చాలా ఆనందంగా ఫీలైపోతున్నారు.
 
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 'సైజ్‌జీరో' చిత్రంలోని తన పాత్ర కోసం అనుష్క కష్టపడి బరువు పెరిగి ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రం కోసం బరువు తగ్గడానికి ప్రయత్నించారు. కానీ పూర్తిస్థాయిలో సన్నబడలేకపోయారు. ఈ కొత్త ఫొటోను చూస్తుంటే అనుష్క తిరిగి ఇంతకు ముందులా తయారైనట్లు కనబడుతోంది. అయితే, అనుష్క ఉన్నట్టుండి ఇలా ఎందుకు సన్నపడ్డారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. 
 
‘బాహుబలి 2’ తర్వాత అనుష్క ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. జి.అశోక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments